హృదయాలు ఒకటయ్యాక కీర్తి అండ్ కో డ్యాన్స్ చూశారా?

అందుకు సంబంధించిన పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Update: 2025-02-24 08:18 GMT

స్టార్ హీరోయిన్, నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేష్ రీసెంట్ గా తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్‌ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది చివరలో వీరు హిందూ, క్రిస్టియన్ రెండు పద్దతుల్లో వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే పెళ్లి తర్వాత చాలా రోజుల వరకు మెడలో పసుపు తాడుతో కనిపించి అందరి చేత ప్రశంసలు అందుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత భర్త ఆంటోనీతో అదిరిపోయే ఫోటో షూట్స్ చేసి వావ్ అనిపించుకుంది. పిక్స్ చాలా క్రేజీగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. నెట్టింట వాటిని వైరల్ చేశారు.

 

తాజాగా కీర్తి సురేష్, ఆంటోనీ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్స్ లో స్టన్నింగ్ పిక్స్ కు పోజులిచ్చారు. వాటిని రీసెంట్ గా పోస్ట్ చేశారు. అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు. మేము మా హృదయాలు ఒకటయ్యాక డ్యాన్స్ చేశాం అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పిక్స్.. నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి. ఫోటోస్ వేరే లెవెల్ లో ఉన్నాయని చెబుతున్నారు.

 

ఒక్కో ఫోటో ఓ రేంజ్ లో ఉందని కొనియాడుతున్నారు. స్లీవ్ లెస్ గౌన్ లో కీర్తి.. సూపర్ గురూ అని చెబుతున్నారు. బ్యూటీ ఆఫ్ ఎవర్ అని ఆకాశానికెత్తేస్తున్నారు. ఫ్యూచర్ లో మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు నెటిజన్లు.

ఇక వీరి లవ్ స్టోరీ విషయానికొస్తే.. 12వ తరగతి చదువుతున్నప్పుడు ఆంటోనీతో ప్రేమలో పడింది కీర్తి సురేష్. ఆమె కన్నా ఆంటోనీ ఏడేళ్ల పెద్ద. అలా 15 ఏళ్ల నుంచి ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారు. 2010లో ఆంటోనీ ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత 2016 నుంచి ఫుల్ స్ట్రాంగ్ గా మారింది వారి రిలేషన్. ఆంటోనీ ఓ ప్రామిస్ రింగ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.

ఆ రింగ్.. పెళ్లి వరకు కీర్తి చేతికి అలాగే ఉంది. ఆమె నటించిన సినిమాల్లో కూడా ఆ రింగ్‌ ను చూడొచ్చట. ముఖ్యంగా పెళ్లి ఫిక్స్‌ అయ్యే వరకు కూడా లవ్ మ్యాటర్ సీక్రెట్ గా ఉంచాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇండస్ట్రీలో కొందరు అంటే సమంత, విజయ్ తదితరులకు ఆ విషయం తెలుసు. 022లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2024లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అలా రీసెంట్ గా కీర్తి తమ లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News