అక్కడ సమంతకంటే కీర్తి బెటర్ గా!
కేవలం మూడు హిందీ వెబ్ సిరీస్ లు తప్ప ఇంత వరకూ ఒక్క సినిమా కి కూడా కమిట్ అవ్వలేదు.;

బాలీవుడ్ లో సమంత కంటే కీర్తి సురేష్ బెటర్ గా కెరీర్ ని బిల్డ్ చేసుకుంటుందా? వచ్చిన అవకాశాల్ని తెలివిగా ఒడిసి పట్టుకుంటుందా? అంటే సన్నివేశం అలాగే అనిపిస్తుంది. సమంత బాలీవుడ్ ప్రయత్నా లు గురించి తెలిసిందే. మూడేళ్లగా హిందీ అవకాశాల కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇంత వరకూ ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు. కేవలం మూడు హిందీ వెబ్ సిరీస్ లు తప్ప ఇంత వరకూ ఒక్క సినిమా కి కూడా కమిట్ అవ్వలేదు.
హైదరాబాద్ నుంచి ముంబైకి షిప్ట్ అయిన దగ్గర నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. స్టార్ హీరోలతో మంచి ర్యాప్ కూడా ఉంది. బడా నిర్మాణ సంస్థలతోనూ మంచి పరిచయాలున్నాయి. కానీ సమంత వెనుక ఏం జరుగుతుందో ఏమోగానీ సినిమా ఛాన్సులైతే రాలేదు అన్నది వాస్తవంగానే కనిపిస్తుంది. ఆమె కంటే బెటర్ గా కీర్తి సురేష్ కనిపిస్తుంది. కీర్తి సమంత తర్వాతే హిందీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఇప్పటికే హిందీలో 'బేబిజాన్' అనే సినిమా కూడా చేసింది. అందులో వరుణ్ ధావన్ కి జోడీగా నటించింది. సినిమా సక్సెస్ అయితే కళావతికి కెరీర్ అక్కడ మరింత స్పీడందుకునేది. అలాగని అవకాశాలకు దూరం కాలేదు. 'అక్కా' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పుడు ఏకంగా రాక్ స్టార్ రణబీర్ కపూర్ కి జోడీగా నటించే ఛాన్సే అందుకుంది. `రామాయణం` తర్వాత రణబీర్ కపూర్ నటించనున్న చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసారు.
ఆ ప్రాజెక్ట్ వివరాలు ఇంకా బయటు రాలేదు గానీ కీర్తి ఎంట్రీ మాత్రం కన్పమ్ అయింది. వీటితో పాటు కొన్ని కొత్త సినిమాలకు సంబంధించి స్టోరీలు కూడా విందట. కీర్తి బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టిన ఏడాదిలోనే ఇదంతా జరగడం విశేషం. అయితే కీర్తికి ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకోవడం కూడా కలి సొచ్చిందిగా కనిపిస్తుంది. వివాహం అనంతరం మంచి ప్రాజెక్ట్ ల్లో అవకాశాలు అందుకుంటుంది.