భయపడి చేసినా.. బాక్సాఫీస్ బద్ధలు కొట్టింది..!
అలాంటి గొప్ప అవకాశాన్ని ముందు కాదని ఆ తర్వాత వాడుకుని ది బెస్ట్ అనిపించుకుంది మహానటి కీర్తి సురేష్.
ప్రతి కథానాయికకు తన పూర్తి స్థాయి ప్రతిభ కనబరిచిన అవకాశం ఒకటి వస్తుంది. తాము చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఎక్కడో ఒక చోట లక్ కూడా ఫేవర్ అవ్వడంతో అలాంటి ఛాన్స్ లు వస్తుంటాయి. ఐతే ఆ అవకాశం వచ్చినప్పుడు పట్టుకుని యూజ్ చేసుకోవాలి. అలాంటి గొప్ప అవకాశాన్ని ముందు కాదని ఆ తర్వాత వాడుకుని ది బెస్ట్ అనిపించుకుంది మహానటి కీర్తి సురేష్. మలయాళ సినిమాలతో మెప్పిస్తూ వచ్చిన ఆమె తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది.
కీర్తి సురేష్ అనగానే అందరికి గుర్తొచ్చే సినిమా మహానటి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించలేదు జీవించేసింది అనొచ్చు. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ఆమెను అభిమానించే ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కేలా చేసింది. ఐతే మహానటి ఆఫర్ ముందు వేరొక హీరోయిన్ కి వెళ్లగా ఆ హీరోయిన్ ఎందుకో అది చేయడం కుదరదని చెప్పేసింది.
కీర్తి సురేష్ దగ్గరకు ఈ బయోపిక్ కథ వస్తే ముందు ఆమె కూడా సినిమా చేయనని అనేసిందట. కీర్తి సురేష్ చేయనని చెప్పడానికి మెయిన్ రీజన్ సావిత్రి లాంటి గొప్ప నటి పాత్రలో తాను ఇమడగలనా లేదా ఆమె అభిమానులు ఈ సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న డౌట్ తో కీర్తి సురేష్ ముందు చేయనని చెప్పిందట. కానీ నాగ్ అశ్విన్ తో పాటు నిర్మాతలు స్వప్న, ప్రియాంకల ప్రోత్సాహంతో ఆ సినిమా చేశానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది కీర్తి సురేష్.
మహానటి సినిమాకు తాను పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానా లేదా అన్న డౌట్ తోనే ఆ సినిమాను కాదన్నా కానీ దర్శక నిర్మాతలు చాలా నమ్మకంగా ఉండటంతో సినిమా చేశా కానీ ఆ సినిమా తనకు ఎన్నో అద్భుతమైన మధురానుభూతులు అందించిందని అంటుంది కీర్తి సురేష్. ఆ సినిమాతోనే కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఒకవేళ కీర్తి సురేష్ మహానటి మిస్ అయ్యుంటే మాత్రం ఒక గొప్ప సినిమా ఛాన్స్ మిస్ అయ్యి ఉండేది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ ఎక్కడ కనిపించలేదు.. సావిత్రి ప్రతిరూపమే అనేలా ఆమె అభినయం ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఇప్పుడే కాదు కీర్తి సురేష్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే సినిమాగా మహానటి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది.