ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మడికి ఫస్ట్ షాక్..!
మహానటి తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో బేబీ జాన్ తో ఎంట్రీ ఇచ్చింది.
మహానటి తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో బేబీ జాన్ తో ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన దళపతి విజయ్ తెరి సినిమాకు రీమేక్ గా బేబీ జాన్ వచ్చింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా ఈ సినిమా చేశారు. ఐతే బాలీవుడ్ ఎంట్రీతో కెరీర్ మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని అనుకుంది కీర్తి సురేష్. కాకపోతే అమ్మడి ప్లాన్ రివర్స్ అయ్యింది. రీసెంట్ గా రిలీజైన బేబీ జాన్ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేదు. ఫలితంగా సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఈమధ్యనే తన బోయ్ ఫ్రెండ్ ఆంటోనిని పెళ్లాడింది కీర్తి సురేష్. పెళ్లైనా కూడా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని ఆశ్చర్యపరచింది. ఐతే కీర్తి సురేష్ కి పెళ్లైన తర్వాత ఫస్ట్ షాక్ తగిలింది. బేబీ జాన్ రిజల్ట్ అమ్మడు ఇలా ఉంటుందని గెస్ చేయలేకపోయింది. బాలీవుడ్ లో సక్సెస్ కొడితే పెళ్లైనా సరే ఇక వరుస అవకాశాలు వస్తాయి కదా అని అనుకుంది కీర్తి బట్ ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేలా చేసింది బేబీ జాన్.
సౌత్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన కీర్తి సురేష్ కథల ఎంపికలో కూడా తన స్పెషాలిటీ చాటుతూ వచ్చింది. ఐతే కీర్తి బాలీవుడ్ లో చేసిన మొదటి సినిమాకే తన గ్లామర్ ఎటాక్ తో సర్ ప్రైజ్ చేసింది. నార్త్ ఆడియన్స్ ని తన గ్లామర్ తో బుట్టలో వేసుకోవాలని చాలా పెద్ద ప్లానే వేసింది. కాకపోతే అది అంతగా వర్క్ అవుట్ కాలేదు. బేబీ జాన్ రిజల్ట్ తో పని లేకుండా కీర్తి సురేష్ కు బాలీవుడ్ ఆఫర్లు వస్తాయా లేదా అన్నది చూడాలి.
ఇక పెళ్లి తర్వాత కెరీర్ కాస్త మందగిస్తుంది అన్నది తెలిసిందే. ఐతే బేబీ జాన్ ఇంపాక్ట్ కీర్తి సురేష్ మీద ఏ మేరకు ఉంటుంది అన్నది చూడాలి. కీర్తి సౌత్ సినిమాల్లో కూడా ఇక మీదట గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా సై అన్నట్టు తెలుస్తుంది. మరి పెళ్లి తర్వాత ఫస్ట్ రిజల్ట్ నిరాశపరిచినా నెక్స్ట్ ఆమెకు టైం కలిసి వస్తుందో లేదో చూడాలి.