భర్తతో కీర్తి మలయాళీ స్టైల్ సంబరాలు
కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది.
గత నెలలో గోవాలో కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోనీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానుల కోసం షేర్ చేసింది. కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది.
ఇప్పుడు పెళ్లయి నెల అయింది. ఈ సందర్భంగా స్పెషల్ మలయాళీ స్టైల్ వివాహ వేడుక నుండి ఫోటోలను షేర్ చేయకుండా ఆగలేకపోయింది. కీర్తి సురేష్ ఈరోజు తన భర్త ఆంటోనీ థటిల్‌తో పెళ్లి తర్వాత వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను వీక్షించాక `సాంప్రదాయ మలయాళీ స్టైల్ సెలబ్రేషన్ అని అర్థమవుతోంది.
కీర్తి సురేష్ - ఆంటోనీ థటిల్ జంట మలయాళ వారసత్వ వేడుకలపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఇప్పుడు సాంప్రదాయ మలయాళీ స్టైల్ సెలబ్రేషన్ ని ప్లాన్ చేసారని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలకు సెలబ్రిటీలు లైక్ లు క్లిక్ లతో ఆదరించారు.
తాజా సమాచారం మేరకు... ఈ నెల చివర్లో కీర్తి తన పసుపు తాళిని తొలగించనుందిట. డిసెంబర్ 12న వివాహం కాగా, అప్పటి నుండి ఈ తాళిని ధరిస్తోంది. త్వరలోనే బంగారు గొలుసు తాళిని ధరిస్తుందని తెలిసింది.