అదే లిప్ లాక్ ఇప్పుడుంటే లాక్ చేసాదా!
మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ 2.0 ని యాక్టివేట్ చేసి దూసుకుపోతుంది. స్కిన్ షో విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.;

మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ 2.0 ని యాక్టివేట్ చేసి దూసుకుపోతుంది. స్కిన్ షో విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. `సర్కారు వారి పాట`తో తనలో గ్లామర్ యాంగిల్ ని ఎలివేట్ చేయడం ప్రారంభించింది. పోటీలో కొనసాగాలంటే? గేట్లు తెరవాల్సిందేనని ఆలస్యంగా రియలైజ్ అయింది. అప్పటి నుంచి చేసే సినిమాల సంఖ్యా పెరిగింది. వెబ్ సిరీస్ ల్లో సైతం నటించే అవకాశాలొస్తున్నాయి.
బాలీవుడ్ దర్శకులు వెతుక్కుంటూ మరీ కళావతి కోసం దిగుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కెరీర్ పై ఎంతగా కాన్సంట్రేషన్ చేసి ముందుకెళ్తుందో తెలిసిందే. హిందీ సినిమాలంటే అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలని గ్రహించి అన్నింటికీ ప్రిపేర్డ్ గానే ఉంది. సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ తో గుబులు పుట్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అవకాశాలు అందుకుంటుంది. ఇదంతా నేటి కీర్తి గురించి.
ఇదే కీర్తి నాలుగేళ్ల క్రితం ఇంతే తెగింపుతో ఉంటే? తెలుగులో మరెన్నో అవకాశాలు అందుకునేది. అలా కోల్పోయిన అవకాశం గురించి తాజాగా రివీల్ అయింది. నితిన్ హీరోగా నటించిన `మ్యాస్ట్రో` సినిమాలో ముందుగా హీరోయిన్ గా కీర్తినే తీసుకోవాలనుకున్నారుట. కానీ సినిమాలో లిప్ లాక్ ఉందనే కారణంతో ఆ ఛాన్స్ ని అమ్మడు రిజెక్ట్ చేసిందిట. అప్పటికే నితిన్ తో కీర్తి `రంగ్ దే` సినిమాలో నటించింది.
ఇద్దరు భార్య భర్తలు పాత్ర పోషించారు. కానీ అందులో ఎలాంటి ఇంటిమేట్ సన్నివేశాలుండవ్. ఆ తర్వాత అదే హీరోయిన్ `మ్యాస్ట్రో` ప్లాన్ చేసారు. లిప్ లాక్ సీన్ పెట్టారు. కానీ అదే లిప్ లాక్ కారణంగా కీర్తి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. అదే లిప్ లాక్ ఇప్పుడుంటే కీర్తి నో చెప్పేది కాదేమో.