100కోట్ల డిజాస్టర్ తరువాత మరో లక్కీ ఛాన్స్?

సౌత్‌లో నేషనల్ అవార్డ్‌ విన్నింగ్ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్‌కు బాలీవుడ్ ఎంట్రీ పెద్ద నిరాశను మిగిల్చింది.;

Update: 2025-03-26 07:51 GMT
Keerthy Suresh Faces Setback in Bollywood

సౌత్‌లో నేషనల్ అవార్డ్‌ విన్నింగ్ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్‌కు బాలీవుడ్ ఎంట్రీ పెద్ద నిరాశను మిగిల్చింది. అట్లీ దర్శకత్వం వహించిన తమిళ బ్లాక్‌బస్టర్ ‘తెరి’ ఆధారంగా తెరకెక్కించిన హిందీ చిత్రం బేబీ జాన్. అయితే ఈ సినిమా ద్వారా ఆమె హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమెకు వన్‌ ఆఫ్ ది లీడ్ పాత్రే అయినా, సినిమా ఫెయిల్యూర్‌తో పాటు ఆమె నటన కూడా విమర్శలు ఎదుర్కొంది.

వరుణ్ ధవన్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్‌లతో కూడిన భారీ బడ్జెట్ మూవీ అయినా, కేవలం రూ.39.28 కోట్లే వసూలు చేయడం అందరికి షాక్ ఇచ్చింది. ఇక దాదాపు రూ.160 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ చిత్రానికి భయంకరమైన లాస్ కలిగించింది. ముఖ్యంగా కీర్తి సురేష్ పోషించిన డాక్టర్ మీర వర్మ పాత్ర ప్రేక్షకులలో ఎమోషనల్ కనెక్షన్ రాకపోవడం గమనార్హం. ఆమె నటనపై కూడా విమర్శలు వచ్చాయి. మహానటితో మెప్పించిన ఆమె ఈ సినిమాలో మెరుగ్గా కనిపించలేదన్న అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమైంది.

ఈ నేపథ్యం చూస్తే, బాలీవుడ్‌లో ఆమె ప్రయాణం ప్రారంభమవకముందే ముగిసినట్టేనా అనే అనుమానాలు కలుగడం సహజం. గతంలో కొంతమంది సౌత్ బ్యూటీలు బాలీవుడ్ లో క్లిక్కయిన కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అలాంటిది ఫస్ట్ సినిమాకే 100 కోట్లు నష్టాలు రావడంతో అమ్మడిపై ఎవరు ఫోకస్ చేయరని కథనాలు వచ్చేశాయి. కానీ తాజాగా వస్తున్న ఓ వార్త మాత్రం ఆమె కెరీర్ పై కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో కీర్తి కలిసి నటించే అవకాశం ఉందట. ఇది తుది అఫీషియల్ కాకపోయినా, ఇందుకు సంబంధించి బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోందని సమాచారం. రణబీర్ కపూర్ ప్రస్తుతం లవ్ అండ్ వార్, రామాయణం, ధూమ్ 4 వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఒక కొత్త ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని టాక్.

ఆ ప్రాజెక్ట్‌కి కీర్తి ఎంపిక కావడం జరిగితే, ఆమెకు బాలీవుడ్‌లో రెండో అవకాశం లభించనుంది. ఈసారి మాత్రం బలమైన స్క్రిప్ట్, మల్టీ లేయర్డ్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. దక్షిణాదిలో తన ప్రూవన్ స్కిల్స్ ఉన్నప్పటికీ, బాలీవుడ్ ప్రేక్షకులకు కీర్తి సురేష్ నటన సరైన కాన్వాస్‌లో చూపించాల్సిన అవసరం ఉంది. రణబీర్ లాంటి వెర్సటైల్ నటుడితో కలిసి నటించడం ఆమె కెరీర్‌కు మళ్లీ ఊపునిస్తే ఆశ్చర్యం లేదు. ఇక బాలీవుడ్‌లో ఆమె మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News