ప్రియుడితో కీర్తి ప్రేమకు 15 ఏళ్లు!
హీరోయిన్ కీర్తిసురేష్ పెళ్లి చేసుకుంటుందంటూ ఇటీవల ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే.
హీరోయిన్ కీర్తిసురేష్ పెళ్లి చేసుకుంటుందంటూ ఇటీవల ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. కేరళకు చెందిన ఆంటోనీ తట్టిల్ ని వివాహం చేసుకుంటున్నట్లు ప్రచారం సాగింది. వచ్చే నెలలో గోవాలో ఈ వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారపై కీర్తి సురేష్ స్పందించింది. అధికారికంగా తన పెళ్లి వార్తను కన్పమ్ చేసింది.
ఆంటోనీ తట్టిల్ ని వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇద్దరు 15 ఏళ్లగా ప్రేమలో ఉన్నామని తెలిపింది. అంటోనీ - కీర్తి అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇద్దరు జంటగా ఆకాశంలో చందమామని చూస్తూ ఆ వెలుగును ఆస్వాదిస్తోన్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇద్దరు 15 ఏళ్లగా ప్రేమించుకుంటున్నారు. అంటే ఎంత గొప్ప ప్రేమికులు అయింటారో చెప్పాల్సిన పనిలేదు.
15 ఏళ్ల పాటు ప్రేమించుకుని ఇప్పుడు వివాహ బంధంతో ఒకటవుతున్నారు. అంటే ఒకర్ని ఒకరు ఎంతగా అర్దం చేసుకుని ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఆంటోనీ తట్టిల్ కేరళలోని కొచ్చికి చెందిన వ్యక్తి. కేరళలోని ప్రముఖ రిసార్ట్ చెయిన్ కు ఓనర్ కావడం విశేషం. కీర్తితో అతడి లవ్ స్కూల్ డేస్ నుంచి మొదలైందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది.
డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో ఈ వివాహం జరుగుతందని ఇప్పటికే కథనాలొస్తున్నాయి. ఈనేపథ్యంలో పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కీర్తి పెళ్లి విషయంలో ఆమె తండ్రి, నటుడు, నిర్మాత సురేశ్ తోపాటు తల్లి మేనక కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.