కీర్తి సురేష్.. లెహంగాలో బుట్టబొమ్మలా..
ఆ ఫోటోస్ ను ఇప్పుడు కీర్తి సురేష్ షేర్ చేశారు. ఫుల్ వర్క్ తో రూపొందిన లెహంగాలో బుట్ట బొమ్మలా కనిపిస్తున్నారు.
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్నారు. కొద్ది రోజుల క్రితం తన ప్రియుడితో రిలేషన్ షిప్ ను కన్ఫామ్ చేసిన ఆమె.. తిరుమలలో మ్యారేజ్ మ్యాటర్ ను అఫీషియల్ గా రీసెంట్ గా అనౌన్స్ చేశారు.
త్వరలో పెళ్లి జరగనుందని, అందుకే తిరుమల వచ్చానని తెలిపారు. గోవాలో వివాహ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఆ తర్వాత 15 ఏళ్ళుగా తాను ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వారిద్దరూ కలిసున్న ఓ ఫోటో షేర్ చేస్తూ.. 15 ఏళ్ళు.. ఇంకా కంటిన్యూ అవుతుందని రాసుకొచ్చారు.
AntoNY x KEerthy ( NYKE ) అని క్రేజీగా క్యాప్షన్ ఇచ్చారు. అయితే త్వరలో పెళ్లి కూతురిగా మారనున్న కీర్తి.. రీసెంట్ గా తన ఫ్రెండ్, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ మ్యారేజ్ కు వెళ్లారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనకోడలు అయిన ఆమె.. కొద్ది రోజుల క్రితం బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో ఏడడుగులు నడిచారు.
శ్రీకాంత్, శ్రావ్య పెళ్లిలో కీర్తి ఓ రేంజ్ లో సందడి చేశారు. అప్పుడు బ్యూటిఫుల్ లెహంగాలో కనిపించారు. ఆ ఫోటోస్ ను ఇప్పుడు కీర్తి సురేష్ షేర్ చేశారు. ఫుల్ వర్క్ తో రూపొందిన లెహంగాలో బుట్ట బొమ్మలా కనిపిస్తున్నారు. మల్లెపూలు.. డీసెంట్ నెక్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ పెట్టుకున్న అమ్మడు.. అదిరిపోయేలా ఉన్నారు.
ప్రస్తుతం కీర్తి సురేష్ పిక్స్.. నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ట్రెడిషనల్ వేర్ లో కీర్తి చాలా బాగున్నారని అంతా చెబుతున్నారు. సో బ్యూటిఫుల్ మేడమ్ అంటూ కొనియాడుతున్నారు. అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేస్తున్నారు. NYKE ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మ్యారేజ్ పిక్స్ కోసం వెయిటింగ్ అని అంటున్నారు.
ఇక కెరీర్ విషయానికొస్తే.. మలయాళం మూవీ గీతాంజలితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. నేను శైలజ సినిమా తో టాలీవుడ్ లోకి వచ్చారు. ఆ చిత్రంతో మంచి హిట్ అందుకున్న కీర్తి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక చిత్రాలతో అందరినీ మెప్పించారు. ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు.