కీర్తి సురేష్‌ను భయపెట్టిన పాత్ర ఏంటంటే..!
మహానటి సావిత్రి పాత్రను తాను పోషించగలనా అనే అనుమానం వ్యక్తం చేసిందట. ఎంతో మంది చేయలేం అంటూ తిరస్కరించిన తర్వాత కీర్తి సురేష్ ఛాలెంజ్‌గా తీసుకుని సావిత్రి పాత్రలో నటించింది.
By: Tupaki Desk | 10 March 2025 5:27 PM ISTకేరళలో పుట్టినప్పటికీ తమిళ్లో ఎక్కువ సినిమాలు చేసి తమిళ ముద్దుగుమ్మ అనిపించుకున్న కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. సుదీర్ఘ కాలంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో కీర్తి సురేష్ చాలా ఆనందంగా ఉంది. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా దూసుకు పోతుంది. మరో వైపు బాలీవుడ్‌లోనూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌ను సైతం అక్కడ చేస్తుంది. టాలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి మంచి క్రేజ్, డిమాండ్ ఉంది. ఇంతగా బిజీగా ఉన్న సమయంలో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడంను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మరో ఐదేళ్లు ఆగిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే కెరీర్లో చాలా సాధించి ఉండేవారు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తన కెరీర్లో అత్యంత కఠినమైన సమయం ఏంటని, తన కెరీర్ మొత్తం మీద షూటింగ్ చేస్తున్న సమయంలో ఛాలెంజింగ్‌గా అనిపించిన సినిమా ఏంటి అనే విషయాలపై కీర్తి సురేష్ స్పందించింది. తెలుగులో నటించిన మహానటి సినిమా సమయంలో కీర్తి సురేష్ తీవ్రమైన ఒత్తిడికి గురి అయిందట. మహానటి సావిత్రి పాత్రను తాను పోషించగలనా అనే అనుమానం వ్యక్తం చేసిందట. ఎంతో మంది చేయలేం అంటూ తిరస్కరించిన తర్వాత కీర్తి సురేష్ ఛాలెంజ్‌గా తీసుకుని సావిత్రి పాత్రలో నటించింది. సినిమాలో అద్భుతంగా నటించి ఏకంగా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది.
మహానటి సినిమాలోని కీర్తి సురేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా ఆ సినిమా కారణంగా పాన్ ఇండియా రేంజ్లో కీర్తి సురేష్ కి మంచి డిమాండ్ పెరిగింది. ఇండస్ట్రీలో కీర్తి సురేష్ అంటే ఓ బ్రాండ్ అనే స్థాయిలో మహానటి సినిమా ఆమెకు పేరు తెచ్చి పెట్టింది. ఆ సినిమా కారణంగా చాలా లేడీ ఓరియంటెడ్ సినిమా ఆఫర్లు కీర్తి సురేష్ వద్దకు వచ్చాయి. అందులో కొన్నింటికి ఓకే చెప్పిన కీర్తి సురేష్ ఆ సినిమాల్లోనూ తన నటనతో మెప్పించింది. కీర్తి సురేష్ టాలీవుడ్లో టాప్ స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుంది. మరో వైపు కోలీవుడ్‌లో మాత్రం క్రమం తప్పకుండా సినిమాలు చేసేందుకు గాను ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
సావిత్రి పాత్ర పోషించిన సమయంలో మొదట కొన్ని రోజులు మానసిక ఒత్తిడికి గురి అయినట్లు చెప్పిన కీర్తి సురేష్ కొన్ని రోజుల్లోనే ఆ ఒత్తిడిని జయించి సినిమాలో నటించడం మొదలు పెట్టాను. సినిమా కొన్నాళ్లు షూటింగ్ జరిగిన తర్వాత కొందరి నుంచి వచ్చిన ప్రశంసలతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలో నటించినట్లు కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. టాలీవుడ్లో ఈమె రీ ఎంట్రీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అక్క అనే వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెబ్ సిరీస్‌లో కీర్తి సురేష్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం అందుతోంది. రాధిక ఆప్టే ఆ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో కనిపించబోతుంది.