కీర్తి లీగ్ లోనే ఉంది.. రుక్మిణి ఛాన్స్ కొట్టేసింది..!
మహానటిగా సినీ ప్రియుల మన్నలను పొందిన కీర్తి సురేష్ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది.;

మహానటిగా సినీ ప్రియుల మన్నలను పొందిన కీర్తి సురేష్ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ అయినా కూడా తన దాకా వస్తే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అదరగొట్టేస్తుంది అమ్మడు. ఐతే పెళ్లి తర్వాత ఎవరికైనా అవకాశాలు కాస్త సన్నగిల్లుతాయన్న పరిస్థితి ఉంటుంది. ఐతే కీర్తి సురేష్ విషయంలో కూడా అలాంటిది ఉంటుందని అనుకున్నారు. కానీ ఆమెకు వస్తున్న ఆఫర్లు చూస్తే అది నిజం కాదన్నదని అర్ధమవుతుంది.
ముఖ్యంగా పెళ్లైన కీర్తి సురేష్ ఒక ఆరు నెలలుగా ఎలాంటి కొత్త సినిమాకు సైన్ చేయలేదు. ఐతే ఆ టైం లో కీర్తి పని అయిపోయిందని అనుకున్నారు అందరు. కానీ వరుసగా ఆమె సైన్ చేసిన సినిమాల గురించి బయటకు వస్తున్న న్యూస్ లు చూసి అందరు షాక్ అవుతున్నారు. కీర్తి సురేష్ తెలుగులో రెండు భారీ సినిమాలకు సైన్ చేసిందని తెలుస్తుంది. కీర్తి ఇప్పటికే విజయ్ దేవరకొండతో కలిసి జత కడుతున్నట్టు టాక్.
విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో కీర్తి లక్కీ ఆఫర్ అందుకుంది. ఈ సినిమాలో ముందు సప్త సాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ ని తీసుకోవాలని అనుకున్నారట. ఆ సినిమా కన్నడలో హిట్టైనా తెలుగులో ఆమెకు సూపర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ క్రమంలో రుక్మిణికి రౌడీ హీరో సినిమా ఛాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రుక్మిణి కాదు ఆ అవకాశం కీర్తి సురేష్ కే ఇచ్చారని తెలుస్తుంది.
ఇదే కాదు కీర్తి సురేష్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చింది. బలగం సినిమా చేసిన వేణు యెల్దండి నెక్స్ట్ చేయబోతున్న ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ ఆఫర్ పట్టేసిందట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమాలతో అమ్మడు అదరగొట్టబోతుందని టాక్. ఇవే కాదు స్టార్ లీగ్ లో తాను ఉన్నానని అనేలా అమ్మడు ప్రూవ్ చేసుకుంటుంది. తమిళ్ లో మొన్నటిదాకా సినిమాలు చేసిన కీర్తి సురేష్ తెలుగులో చివరగా భోళా శంకర్ సినిమా చేసింది. దసరాలో వెన్నెల పాత్రలో ఇంప్రెస్ చేసిన కీర్తి భోళా శంకర్ తో నిరాశపరచింది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ సినిమాలతో మరోసారి ఆకట్టుకోబోతుంది.