కీర్తి సురేష్ ని ఆ హీరో అంకుల్ అని పిలవొద్దన్నాడా?
మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్మడి ఖాతాలో రెండు తమిళ సినిమాలున్నాయి.
మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్మడి ఖాతాలో రెండు తమిళ సినిమాలున్నాయి. కొత్త ఏడాది ఇంకా కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు. ఇటీవలే బాలీవుడ్ లో `బేబిజాన్` తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ కొత్త ఛాన్సుల కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే `అక్క` అనే వెబ్ సిరీస్ కు సంతకం చేసింది.
అందులో బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టేతో పోటీ పడి నటిస్తోంది. ఇక మాలీవుడ్ కి అయితే కొంత కాలంగా దూరంగా ఉంటోంది. రెండేళ్లగా అక్కడ సినిమాలు చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మాలీవుడ్ వివాదాస్పద నటుడు దిలీప్ తో తనకున్న అనుబంధం గురించి రివీల్ చేసింది. చిన్నతనంలో దిలీప్ కుమార్తె పాత్రలు పోషించినట్లు కీర్తి తెలిపింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు దిలీప్ ని అంకుల్ అని పిలిచేదట.
అలాగే దిలీప్ సరసన హీరోయిన్ గా నటించేందుకు పెద్దగా ఆలోచించలేదని అంటోంది. చిన్ననాటి నుంచి అతడిని చూస్తూ ఉండటంతో సహజంగానే నటించానంది. అతడేం మారలేదని, ఇప్పటికీ అలాగే ఉన్నాడని తెలిపింది. 2002లో దిలీప్ హీరోగా నటించిన చిత్రం `కుబేరన్`. ఇందులో అతడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. అందులో ఒక దత్త పుత్రికగా కీర్తి సురేష్ బాల నటిగా నటించింది.
అటుపై 2014లో వచ్చిన `రింగ్ మాస్టర్` సినిమాలో దిలీప్ ప్రేయసిగా నటించింది. కీర్తి సురేష్ మలయాళ నటి మేనక కుమార్తె అన్న సంగతి తెలిసిందే. మేనక మెగాస్టార్ చిరంజీవికి మంచి స్నేహితురాలు. అలాగే కీర్తి తండ్రి మలయాళ చిత్రాల నిర్మాత కూడా. అలా కీర్తి చిన్న నాటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగింది.