పెళ్లయి వారం అయినా కాలేదు.. అప్పుడే భర్తకు దూరంగా?
పెళ్లి అనంతరం 'బేబి జాన్' ప్రమోషన్స్ కోసం విచ్చేసిన కీర్తి తన మంగళసూత్రాన్ని గర్వంగా మీడియా ముందు ప్రదర్శిస్తోంది.
తన వృత్తిలో కీర్తి డెడికేషన్ చర్చనీయాంశంగా మారింది. కీర్తి సురేష్ వివాహం అయిన వారం రోజుల్లోనే తిరిగి పనిలో చేరిపోయింది. పెళ్లి అనంతరం 'బేబి జాన్' ప్రమోషన్స్ కోసం విచ్చేసిన కీర్తి తన మంగళసూత్రాన్ని గర్వంగా మీడియా ముందు ప్రదర్శిస్తోంది. పెళ్లి అనే ప్రమోషన్‌ని కీర్తి అస్సలు దాచుకోవడం లేదు.
కీర్తి సురేష్ ఇండస్ట్రీకి ఇంకా కొత్త పెళ్లికూతురు. డిసెంబర్ 12న తన చిరకాల ప్రియుడు ఆంటోనీ తటిల్‌ని గోవాలో వివాహం చేసుకున్న ఈ బ్యూటీ కాళ్ల పారాణి ఇంకా ఆరనేలేదు. పెళ్లి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంతలోనే తన సినిమా ప్రచారానికి కీర్తి బరిలోకి వచ్చేసింది. తన కోస్టార్ వరుణ్ ధావన్ తో కలిసి 'బేబి జాన్'కి ప్రచార హంగామా సృష్టిస్తోంది.
నిజానికి పెళ్లి తర్వాత వధూవరులు హనీమూన్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తారు. కీర్తి కూడా హనీమూన్‌కు వెళుతుందని అభిమానులు ఆశించారు. అయితే పెళ్లయిన వెంటనే కీర్తి ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ బ్యూటీ దృష్టి ప్రస్తుతం హనీమూన్ పై కాదు.. సినిమా ప్రమోషన్‌పై ఉంది. ఓవైపు పుష్ప 2 ఉత్తరాది బెల్ట్ లో హవా సాగిస్తున్న నేపథ్యంలో పోటీబరిలో తన సినిమాని దించుతోంది. అందుకే అన్ని బరువు బాధ్యతలను కీర్తి తన భుజస్కంధాలపైనే మోస్తోంది. ఇప్పటికే రిలీజైన బేబిజాన్ టీజర్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. తదుపరి ప్రచార హంగామాపైనే కీర్తి ఫోకస్ చేస్తోంది.
తాజాగా తన హీరో వరుణ్ ధావన్ తో కలిసి కీర్తి సురేష్ దుబాయ్ పర్యటనలో ఉంది. అక్కడ బేబి జాన్ ప్రచారం కోసం అల్ట్రా మోడ్రన్ స్టైల్లో కనిపించింది. ధావన్ స్టైల్ గా బ్లేజర్ లో కనిపించగా, కీర్తి థై సొగసులను ఆవిష్కరించే స్పెషల్ డిజైనర్ సూట్ లో ప్రత్యేకంగా కనిపించింది. ఆసక్తికరంగా మోడ్రన్ డ్రెస్ లో కనిపించినా కానీ, కీర్తి మెడలో మంగళసూత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారతీయ మహిళ తాళిని గౌరవించడం అంటే భర్తను గౌరవించడమే. సాంప్రదాయం తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కీర్తి ఆచారాలను బలంగా పాటిస్తుందని ప్రూవ్ అయింది.
సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ వివాహం తరువాత కీర్తి - ఆంటోనీ క్రైస్తవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ రెండు వివాహాలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆసక్తికరంగా కీర్తి భర్త ఆంటోని దుబాయ్ కేంద్రంగా రెస్టారెంట్ చైన్ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అదే దుబాయ్ లో కీర్తి తన సినిమా బేబిజాన్ ప్రచారంలో ఉంది.