కీర్తి సురేష్ వెడ్డింగ్ బెల్స్.. సందడి మాములుగా లేదు

ఈ వివాహ వేడుకకి వచ్చే అతిథుల కోసం ఈ జంట ప్రత్యేక ఏర్పాట్లు చాలా చేసారంట.

Update: 2024-12-11 15:55 GMT

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్ తో ఏడడుగులు వేయబోతోంది. గోవాలో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య గ్రాండ్ గా జరగబోతోంది. ఈ వివాహ వేడుకకి వచ్చే అతిథుల కోసం ఈ జంట ప్రత్యేక ఏర్పాట్లు చాలా చేసారంట. ఎంటర్టైన్మెంట్ తో పాటు, వినోదం అందించే విధంగా వారిద్దరికి సంబందించిన వెడ్డింగ్ గ్రీటింగ్స్, ఫజిల్స్ తో ప్రత్యేకంగా అలంకరించారంట.

వీటికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరి పెళ్లి కేరళ హిందూ సంప్రదాయంతో పాటు, క్రిస్టియన్ స్టైల్ లో రెండు సార్లు జరగబోతోంది. గురువారం ఉదయం వివాహ వేడుక ముహూర్తం నిర్ణయించారంట. కీర్తి సురేష్, ఆంటోనీ తటిల్ కలిసి దిగిన ఫోటోలని స్పెషల్ గిఫ్ట్ కార్డ్స్ గా డిజైన్ చేశారు. కేరళ సంప్రదాయ శైలిలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని నిర్వహించారు.

ఇందులో వారిద్దరి ఇష్టాలని రిప్రజెంట్ చేసే విధంగా గిఫ్ట్స్, బ్యాండ్ లు ఏర్పాటు చేశారు. ఈ నైట్ కి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఉండబోతోందంట. దీని తర్వాత పెళ్లి తంతు మొదలవుతుందని తెలుస్తోంది. ఆంటోనీ తటిల్ కి వ్యాపారాలు ఉన్నాయి. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. కాలేజీ డేస్ నుంచి ప్రేమలో ఉన్నారు. 15 ఏళ్ళ వీరి రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు.

కీర్తి సురేష్ నటించిన హిందీ మూవీ ‘బేబీ జాన్’ డిసెంబర్ 20న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాపై అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది. పెళ్లి తర్వాత మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే తమిళంలో చేసిన ‘రివాల్వర్ రీటా’ కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. దాంతో పాటు మరో రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

తెలుగులో కూడా ఓ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే మాట వినిపిస్తోంది. చివరిగా కీర్తి సురేష్ దసరా సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తమిళ్, హిందీ ప్రాజెక్ట్స్ ఉండటంతో తెలుగులో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పెళ్లి తర్వాత ఆమె స్టోరీస్ సెలక్షన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News