సోలోగా స్వామి వారి చివరి దర్శనం ఇదే!
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నటి కీర్తి సురేశ్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నటి కీర్తి సురేశ్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న నటికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సమయంలో కీర్తి సురేష్ ని చూడటానికి భక్తులు గుమిగూడారు. కొంత మంది సెల్పీలు అడిగే ప్రయత్నం చేసారు.
ఇక కీర్తి సురేష్ త్వరలో వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ని వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇద్దరు 15 ఏళ్లగా ప్రేమలో ఉన్నామని తెలిపింది. డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో ఈ వివాహం జరుగుతందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి.
సరిగ్గా ఇదే సమయంలో కీర్తి శ్రీవారిని దర్శించుకోవడంతో? వివాహానికి ముందు చివరిగా స్వామి వారి సేవ కోసం ఇలా సందర్శించినట్లు తెలుస్తోంది. ఇక నటిగా కీర్తి సురేష్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ పై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టి పనిచేస్తోంది. డిసెంబర్ లోనే ఆమె నటించిన `బేబి జాన్` హిందీ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ప్రచారం పనుల్లోనూ కీర్తి పాల్గొనాల్సి ఉంది.
ఇటు పెళ్లి పనులు..అటు సినిమా ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే వివాహం సింపుల్ గా జరుగుతుందని తెలుస్తోంది. గోవాలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక జరుగుతుందని ప్రచారం జరుగుతుంది.