గోవా బీచ్‌లో కీర్తి పెళ్లి.. ఐదు రోజుల ముందే..!
ఈ పెళ్లి వేడుకకు కీర్తి కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధుమిత్రులు మాత్రమే ఆహ్వానిస్తూ వేడుకను ప్రయివేట్ గా ప్లాన్ చేసారు.
మహానటి కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడైన ఆంటోనీ తటిల్‌ని ఈ నెల 12న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. గోవాలో ఈ వివాహం జరగనుండగా ఐదు రోజుల ముందే కీర్తి సురేష్, ఆమె కుటుంబం గోవాలో అడుగుపెట్టింది. అక్కడ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మరో స్థాయిలో ప్లాన్ చేసారని తెలిసింది. ఈ పెళ్లి వేడుకకు కీర్తి కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధుమిత్రులు మాత్రమే ఆహ్వానిస్తూ వేడుకను ప్రయివేట్ గా ప్లాన్ చేసారు.
మొదలైంది .. కేఏ వెడ్డింగ్! పేరుతో కీర్తి సురేష్ ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. కీర్తి ఇంతకుముందే ఆంటోనితో తన స్నేహం ప్రేమ గురించి ఓపెనైంది. ''15 సంవత్సరాలుగా ఆంటోనితో స్నేహం, ప్రేమానుబంధం ఉన్నాయని .. పెళ్లితో ఒకటవుతున్నామ''ని కీర్తి స్వయంగా ఇన్ స్టాగ్రమ్ లో వెల్లడించింది. ఆంటోనీ తటిల్ ఇంజనీర్. అతడు పూర్తి స్థాయి వ్యాపారవేత్తగా మారారు. కేరళకు చెందిన ఆస్పెరోస్ విండో సొల్యూషన్స్ అనే వ్యాపారానికి యజమాని. దుబాయ్ కేంద్రంగా పని చేస్తూ పలు దేశాల్లో తన వ్యాపారాలను విస్తరించారు.
పెళ్లికి ముందు కీర్తి తన తల్లిదండ్రులు సురేష్ కుమార్ - మేనకా సురేష్ .. తన సోదరి రేవతి సురేష్‌తో కలిసి తిరుపతి వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించింది. ఇప్పటికే గోవాలో పెళ్లి కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ కీర్తి సురేష్ కుటుంబం వరుస సెలబ్రేషన్స్ తో సందడి చేయనుంది. బ్యాచిలరొట్టే పార్టీలతో కీర్తి చిల్ కానుంది.