మరోసారి కీర్తి పెళ్లి.. లవ్లీ లిప్ లాక్

ఇప్పుడు క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం ఓ చర్చిలో ఆదివారం మరోసారి కీర్తి, ఆంటోనీ వివాహ వేడుక ఘనంగా జరిగింది.

Update: 2024-12-16 05:46 GMT

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. రీసెంట్ గా తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 12వ తేదీన గోవాలో హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగిన వేడుకలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అందుకు సంబంధించిన పిక్స్.. ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం ఓ చర్చిలో ఆదివారం మరోసారి కీర్తి, ఆంటోనీ వివాహ వేడుక ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి సురేష్ రీసెంట్ గా షేర్ చేశారు. "For The Love Of Nyk" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆంటోనీతో లిప్ లాక్, రింగ్స్ మార్చుకున్న పిక్స్ తో పాటు డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు నెట్టింట ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి.

ఇప్పటికే కొత్త జంటకు పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విషెస్ చెప్పగా.. ఇప్పుడు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కొత్త పిక్స్ లో కీర్తి సురేష్.. వైట్ కలర్ గౌనులో చాలా అందంగా ఉన్నారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. చిల్ అవుతున్నట్లు ఉన్నారు.

అయితే కీర్తి సురేష్, ఆంటోనీ దాదాపు 15 ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉన్నారు. ఆ విషయాన్ని కీర్తినే రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా దిగిన ఫోటోను పంచుకుని.. తమ ఫ్రెండ్ షిప్ జీవితాంతం కొనసాగనుందని అనౌన్స్ చేశారు. తన పెళ్లిపై ఎన్నో రూమర్స్ వచ్చినా మౌనంగా ఉండి.. సడెన్ గా ప్రకటించారు.

స్కూల్ డేస్ లో కీర్తి, ఆంటోనీకి పరిచయం ఏర్పడింది. అలా కాలేజీ టైమ్ లో స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఇరు కుటుంబాల్లో ఒప్పించి వివాహం చేసుకున్నారు. కీర్తి సురేష్ ది సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ కాగా.. ఆంటోనీ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన వారు. ఆయనకు చెన్నై, కొచ్చిలో వివిధ వ్యాపారాలు ఉన్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. రఘతాతతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రివాల్వర్ రీటా, బేబీ జాన్ చిత్రాలతో ఇప్పుడు బిజీగా గడుపుతున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న బేబీ జాన్ మూవీతో సందడి చేయనున్నారు. ఆ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. మరి ఫ్యూచర్ లో కీర్తి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News