స్టార్ హీరోలతో కీర్తి ఓన్లీ రొమాన్స్ మాత్రమేనా!
దీంతో అమ్మడు కెరీర్ మళ్లీ పట్టాలెక్కి నట్లే ఎక్కింది. ఇదే సమయంలో కోలీవుడ్ లో కొన్ని రకాల వైవిథ్యమై న పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలందుకుంది.
'మహానటి' తర్వాత కీర్తి సురేష్ జర్నీ ఓ రేంజ్ లో సాగుతుందనుకుంటే! ఎవరూ ఊహించని విధంగా సాగింది. ఆ ఇమేజ్ నుంచి అమ్మడు బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. గ్లామర్ పాత్రలకు ఎస్ చెప్పలేక..నచ్చిన సినిమాలకు సైన్ చేయలేక చెప్పుకోలేని ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల లేడీ ఓరియేంటెడ్ అటెంప్ట్ లు చేసి చేతులు కాల్చుకుంది. చివరికి కెరీర్ విషయంలో రాజీ పడక తప్పలేదు. నిబంధనలన్నింటి పక్కన బెట్టి గ్లామర్ డోస్ పెంచింది.
దీంతో అమ్మడు కెరీర్ మళ్లీ పట్టాలెక్కి నట్లే ఎక్కింది. ఇదే సమయంలో కోలీవుడ్ లో కొన్ని రకాల వైవిథ్యమై న పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాం త్..మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఆ హీరోలకు చెల్లి పాత్రలు పోషించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. 'అన్నాథై' లో రజనీకి చెల్లిగా..'భోళా శంకర్' లోనూ చిరంజీవి చెల్లి పాత్రలు పోషించింది.
ఆ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలు సాధించాయో తెలిసిందే. 'అన్నాథై' కోలీవుడ్ పర్వాలేదని పించినా..టాలీవుడ్ లో మాత్రం దెబ్బ పడింది. ఇక 'భోళా శంకర్' ఫలితం గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఆ రెండు సినిమాలో కీర్తి పాత్రలు ఆమెకి ఊహించని చేదు అనుభవాన్ని మిగిల్చాయి. తాను ఒకటి అనుకుంటే రిజల్ట్ ఊహకందని విధంగా వచ్చింది. దీంతో అమ్మడికిప్పుడు చెల్లి పాత్రలంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.
ఎలాంటి పాత్రలోనైనా నటిస్తా కానీ! చెల్లి పాత్రలంటూ ఎవరైనా అప్రోచ్ అయితే తన అనుమతి కూడా తీసుకోకుండా నో చెప్పేయండని మేనేజర్లకు చెప్పిందిట. ఈ ప్రభావం టాలీవుడ్ లో ఎక్కువగా పడినట్లు భావిస్తోందిట. ఇప్పటికే తెలుగింట కెరీర్ నత్త నడుకన సాగుతోన్న సమయంలో కొన్నిరకాల పాత్రలు డ్యామేజ్ చేసినట్లు గా ఫీలవుతుందిట. ప్రస్తుతం అమ్మడి లైనప్ చూస్తే కోలీవుడ్ సినిమాలు తప్ప! తెలుగు సినిమాలేవి లేవు. కథలు వింటున్నట్లు కనీసం ప్రచారం కూడా లేదు.