ఫొటో టాక్: కీర్తి గ్లామర్ కు పోటీ ఇవ్వగలరా?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గత ఏడాది తెలుగులో దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది

Update: 2024-08-02 09:59 GMT
ఫొటో టాక్: కీర్తి గ్లామర్ కు పోటీ ఇవ్వగలరా?
  • whatsapp icon

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గత ఏడాది తెలుగులో దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తరువాత తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కిన సైరన్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించింది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని తర్వాత మరల తెలుగులో ఈ బ్యూటీ కొత్త సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొన్ని కథలు వింటున్నట్లు మాత్రం టాక్ వినిపిస్తోంది.

అయితే తమిళంలో మూడు, హిందీలో ఒక సినిమా ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఉన్నాయి. హిందీలో వరుణ్ ధావన్ కి జోడీగా బేబీ జాన్ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోంది. తమిళంలో విజయ్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన తెరికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అట్లీ ఈ సినిమాని హిందీలో వేరొకరితో కలిసి నిర్మిస్తున్నారు. అలాగే రీసెంట్ గా కీర్తి సురేష్ నటించిన రఘు తాత అనే తమిళ్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కాబోతోంది. రివాల్వర్ రీటా అనే మరో సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. కెరియర్ ఆరంభంలో బొద్దుగా ఉండే కీర్తి సురేష్ తరువాత స్లిమ్ అయ్యి హాట్ బ్యూటీగా మారిపోయింది. సర్కారువారిపాట సినిమాలో మహేష్ బాబుకి జోడీగా నటించిన కీర్తి చాలా గ్లామర్ గా కనిపించింది. బేబీ జాన్ లో ఆమె నెక్స్ట్ లెవల్ లో తనని తాను షోకేస్ చేసుకోబోతోందని తెలుస్తోంది.

స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ఉండటంతో కీర్తి సురేష్ పెర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తోంది. దీనికోసం రెగ్యులర్ గా వర్క్ అవుట్స్ కూడా చేస్తోందని తెలుస్తోంది. ఫుడ్ విషయంలో కూడా చాలా కేరింగ్ తీసుకుంటుంది. సహజసిద్ధమైన అందాన్ని పదిలంగా కాపాడుకోవడానికి జిమ్ లో నిత్యం కసరత్తులు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు జిమ్ లో షార్ట్, టీషార్ట్ తో సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఈ ఫోటోకి నెటిజన్లు నుంచి ఇంటరెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇదే లుక్, పర్సనాలిటీతో మంచి గ్లామర్ రోల్ పడితే కీర్తి సురేష్ దరిదాపుల్లోకి ఎవ్వరు రాలేరనే మాట ఆమె అభిమానుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే వరకు ఆమె కెరియర్ లో డీసెంట్ ట్రెడిషనల్, లేదంటే మాస్ క్యారెక్టర్స్ మాత్రమే చేసింది. సర్కారువారిపాట సినిమాలో కాస్తా గ్లామర్ రోల్ లో కనిపించింది. అలాంటి క్యారెక్టర్ లో మరోసారి కీర్తి సురేష్ ని ఫ్యాన్స్ చూడాలని ఆశపడుతున్నారు.

Tags:    

Similar News