కింగ్ ఆల‌స్యానికి కింగ్ ఖానే బాధ్యుడు

షారూఖ్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్‌తో క‌లిసి సిద్ధార్థ్ ఆనంద్ బ్యాన‌ర్ ఈ సినిమాని నిర్మిస్తోంది.;

Update: 2025-03-06 16:30 GMT

షారూఖ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `కింగ్` 2025-26 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో ఒక‌టిగా నిల‌వ‌నుంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సి ఉంది. కానీ సుజోయ్ ఘోష్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో సుజోయ్ త‌ప్పుకోగా, చివ‌రికి సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షారూఖ్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్‌తో క‌లిసి సిద్ధార్థ్ ఆనంద్ బ్యాన‌ర్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ప‌దే ప‌దే వాయిదా ప‌డుతుండ‌డం అంద‌రినీ నిరాశ‌ప‌రుస్తోంది. కింగ్ షూటింగ్ గత సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సంవత్సరం ప్రారంభంలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసినా కానీ మళ్ళీ వాయిదా పడింది. షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరం జూన్ నుండి కింగ్ షూటింగ్ ప్రారంభించనున్నారు.

యూర‌ప్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్స్ తో పాటు భార‌త‌దేశంలోను సినిమాని తెర‌కెక్కిస్తారు. సుజోయ్ ద‌ర్శ‌కుడిగా, సిద్ధార్థ్ ఆనంద్ మొదట యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేయాలని స‌హ‌నిర్మాత‌గా కొన‌సాగాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అతడు ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. కింగ్ 2026 చివరి నాటికి విడుదల కానుంది. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సుహానా ఖాన్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నుంది. అభిషేక్ బచ్చన్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Tags:    

Similar News