ఖాన్ వ‌ర్సెస్ ఖాన్.. సుహానా రెండో సినిమా?

అలాగే సుజోయ్ తో సినిమా, త‌దుప‌రి ప‌ఠాన్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమాలు కూడా 1000 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఖాయ‌మ‌ని అభిమానుల్లో అంచ‌నాలున్నాయి.

Update: 2023-10-19 04:59 GMT

పఠాన్-జవాన్ చిత్రాల ఘ‌న‌విజయాన్ని ఆస్వాధించిన షారుఖ్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ 'డుంకీ'తో హ్యాట్రిక్ హిట్ కొట్టాల‌ని ఆస‌క్తిగా వేచి చూస్తున్నాడు. రాజ్‌కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన ఈ సినిమా ష్యూర్ షాట్ హిట్ కొడుతుంద‌ని ఆశిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై అంత‌కంత‌కు ఉత్కంఠ పెరుగుతుండగా SRK తదుపరి సినిమా గురించి ఊహాగానాలు వైర‌ల్ సాగుతున్నాయి. షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రానికి ప్రఖ్యాత సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తాడని, ఈ చిత్రంలో ఖాన్ డాట‌ర్ సుహానా ఖాన్ కూడా న‌టిస్తుంద‌ని తెలుస్తోంది.

ఇది కూడా మునుప‌టిలానే భారీ యాక్షన్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. చిత్రీకరణ నవంబర్ 2024లో ప్రారంభం కానుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌ని కూడా ఖాన్ నిశ్చయించుకున్నాడని స‌మాచారం. మార్చి 2023 నాటికి తన సన్నిహిత మిత్రుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి 'టైగర్ వర్సెస్ పఠాన్' అనే మరో భారీ యాక్షన్ సినిమాని ప్రారంభించడానికి ముందు సుజోయ్‌తో సినిమాని ముగించేయాల‌న్న అత‌డి ప్రాధాన్య‌త‌ ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

సుజోయ్ ఘోష్ చిత్రం సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్‌పై అరంగేట్రం చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఈ చిత్రాన్ని దేశ విదేశాల్లో చిత్రీక‌రిస్తార‌ని తెలిసింది. ఆరు నెలల పాటు దీనిపై ప‌ని చేస్తారు. యాక్షన్ జానర్‌లో నైపుణ్యం సాధించిన సిద్ధార్థ్ ఆనంద్, SRKతో కలిసి సుజోయ్ ఘోష్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. SRK-సుహానా ఖాన్ కాంబినేష‌న్ చిత్రం కోసం ఇప్పటికే అభిమానులు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. 2024 చివరిలో ఈ చిత్రం పెద్ద స్క్రీన్ ల‌లో కి వ‌స్తుంది. ఖాన్ అభిమానులు ఆడ్రినలిన్ ప‌వ‌ర్ ప్యాక్డ్ సినిమాటిక్ అడ్వెంచర్ కోసం అంత‌వ‌ర‌కూ థ్రిల్లింగ్ గా ఎదురుచూడవచ్చు.

వ‌రుస‌గా 1000 కోట్ల క్ల‌బ్‌లు?

కింగ్ ఖాన్ షారూఖ్ ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండు 1000 కోట్ల క్ల‌బ్ చిత్రాల్లో న‌టించాడు. ఇవ‌న్నీ పాన్ ఇండియా స్థాయిలో బాగానే ఆడాయి. త‌దుప‌రి డుంకీతో మ‌రో 1000 కోట్ల క్లబ్ ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని ఖాన్ ఉవ్విళ్లూరుతున్నాడు. అలాగే సుజోయ్ తో సినిమా, త‌దుప‌రి ప‌ఠాన్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమాలు కూడా 1000 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఖాయ‌మ‌ని అభిమానుల్లో అంచ‌నాలున్నాయి. మునుముందు ప‌రిణామాలు ఎలా మార‌తాయో.. అస‌లేం జ‌రుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News