ఏదో ఏదో.. కార్తిక్ గానంతో స్వీట్ మెలోడీ

యువ హీరో రాహుల్ విజయ్ ఈమధ్య కాలంలో డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్న హీరోగా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు.;

Update: 2025-04-14 06:25 GMT
Yedo Yedo Song  From KKDB Movie

యువ హీరో రాహుల్ విజయ్ ఈమధ్య కాలంలో డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్న హీరోగా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక అతని సినిమాలలో పాటలు కూడా వైరల్ అవుతుండడం విశేషం. ఇక వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యాన్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ లో అతను హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.


రాహుల్ విజయ్, నేహా పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమాలో తొలి పాటగా విడుదలైన "ఏదో ఏదో" సాంగ్ ఇప్పుడు సంగీత ప్రియుల హృదయాలను తాకుతోంది. ఈ మెలోడీ ట్రాక్ వినగానే మనసుని తేలికగా తాకేలా ఉంటుంది. ప్రముఖ గాయకుడు కార్తిక్ తన గానంతో పాటను మరింత మధురంగా మార్చారు. ముఖ్యంగా కార్తిక్ వాయిస్‌లో కరుణ కలిగించే ఆవేదన, నేహా వాయిస్‌లో మృదుత్వం కలిసి ఈ పాటను ప్రత్యేకంగా నిలిపాయి.

ఈ పాటకు సంగీతాన్ని అందించిన సురేష్ బొబ్బిలి, తన ట్రేడ్మార్క్ స్టైల్‌ను కొనసాగిస్తూ ఈ సారి కొత్తగా కంపోజ్ చేశారు. పూర్ణ చారి అందించిన లిరిక్స్ కూడా పాటకు అర్ధవంతమైన భావాలను అందించాయి. ప్రేమలో ఉన్న జంట మధ్య భావోద్వేగాలను ఈ పాట చక్కగా వ్యక్తీకరిస్తుంది. లిరికల్ వీడియోలో రాహుల్ విజయ్, నేహా పాండే మధ్య కెమిస్ట్రీ ఎంతో సహజంగా చూపబడింది.

ఇద్దరి మధ్య ఉన్న అనురాగం, ఆత్మీయత ఈ పాట ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని సింపుల్ కాన్సెప్ట్ విజువల్స్‌తో ఈ పాటను ప్రేక్షకులు తిరిగి తిరిగి వినాలనిపించేలా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు అశోక్ రెడ్డి కడడోరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డెబ్యుట్ మూవీ అయినప్పటికీ, ఆయన విజన్ క్లారిటీగా కనిపిస్తోంది.

సినిమాలో గెటప్ శ్రీను, అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గంగవ్వ, రచ్చ రవి, రవి వర్మ వంటి కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించబోతున్నారు. ఇది పూర్తి ఫన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడం విశేషం. మొత్తంగా చూసుకుంటే, ఈ పాటతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతున్నారు.

Full View
Tags:    

Similar News