ఖుషి బ్యాక్ టు స్కూల్ లుక్.. కెవ్వు కేక అంతే..!

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే సోషల్ మీడియాలో తన పాపులారిటీ పెంచుకుంటుంది అమ్మడు.

Update: 2025-02-20 16:27 GMT

శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ఇప్పటికే అటు బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ ఆడియన్స్ ని అలరిస్తుంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవరతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. ఇక నెక్స్ట్ అమ్మడు రామ్ చరణ్ తో కలిసి జత కడుతుంది. ఐతే జాన్వితో పాటు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సోదరి ఖుషి కపూర్ కూడా రెడీ అవుతుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే సోషల్ మీడియాలో తన పాపులారిటీ పెంచుకుంటుంది అమ్మడు.


ఖుషి కపూర్ ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మడు ఇలా ఫోటో పెడితే చాలు అలా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. సినీ ఎంట్రీ కెరీర్ ప్రస్తుతానికి ఇవే టెన్షన్ లేవు కాబట్టి ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంది ఖుషి. అక్క ఆల్రెడీ సినిమాలు చేస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. నెక్స్ట్ ఖుషి కూడా అదే రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకోవాలి. అందుకే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది అమ్మడు.


ఖుషి కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్ ఫాలోవర్స్ కి షాక్ ఇచ్చింది. బ్యాక్ టు స్కూల్ అంటూ థై షో చేస్తూ అమ్మడు వేసుకున్న మిడ్డీ కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తుంది. తనలా ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఎవరి వల్ల కాదనిపించేలా అమ్మడి గ్లామర్ షో ఉంది. సినిమాల్లోకి రాకముందే ఈ రేంజ్ లో రెచ్చిపోతుంటే ఇక సినిమాల్లోకి వచ్చాక మరింత గ్లామర్ షో చేసే ఛాన్స్ ఉంటుంది.


ఖుషి కపూర్ కూడా కెరీర్ ప్లానింగ్ లో భాగంగానే ఇలా ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తున్న అమ్మడికి సోషల్ మీడియాలో ఇంకా ఇంకా ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఖుషి అలా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం సౌత్ మేకర్స్ కూడా ఆమెతో సినిమా తీయాలని చూస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు దర్శకులు ఇప్పటికే ఖుషి కపూర్ ని దృష్టిలో ఉంచుకున్నారని తెలుస్తుంది. మరి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ కపూర్ సిస్టర్స్ మధ్యనే గట్టి పోటీ ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.

Tags:    

Similar News