ఖుషి ఓటీటీ.. మాటలు, రూలు గాలికొదిలేశారు
విజయ్ దేవరకొండ సమంత నటించిన ఖుషి సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఒక మ్యాజికల్ రికార్డుగా నిలుస్తుంది అని మొదట అందరూ అనుకున్నారు.
విజయ్ దేవరకొండ సమంత నటించిన ఖుషి సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఒక మ్యాజికల్ రికార్డుగా నిలుస్తుంది అని మొదట అందరూ అనుకున్నారు. దర్శకుడు శివా నిర్వాన మేకింగ్ విధానానికి మొదటి రోజు ప్రశంసలు బాగానే వచ్చాయి. ఇక సినిమా పండితులు కూడా ఈ సినిమాకు రివ్యూలు చాలా పాజిటివ్ గానే ఇచ్చారు. దీంతో మొదటి వీకెండ్ లోనే సినిమా మంచి ఓపెనింగ్ అందుకుంది.
70 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు మొదట్లో హడావిడి చేశారు. సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే వీకెండ్ అనంతరం సోమవారానికి వచ్చేసరికి సినిమా అసలు మ్యాటర్ అర్థమయిపోయింది. అసలు జనాలకు ఈ సినిమా పూర్తిస్థాయిలో నచ్చలేదు అని ముఖ్యంగా చాలా ల్యాగ్ అనేలా కామెంట్స్ అయితే వచ్చాయి.
తప్పకుండా ఈ సినిమా మరో గీతగోవిందం అవుతుంది అని ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండకు చివరికి నిరాశ మిగిలింది. అయితే మొత్తానికి ఇప్పుడు ఈ సినిమాను అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. నెట్ ఫ్లిక్స్ లో సినిమాను అక్టోబర్ 1 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ వచ్చింది.
గత రెండు మూడేళ్ల నుంచి కూడా ఓటీటీ వ్యవస్థపై డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కొంత ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అసలైతే సినిమాలను కనీసం 50 రోజుల వరకైనా సరే థియేటర్లలో ఆడించాలి అని రూల్స్ కూడా పెట్టారు. మాట తప్పకుండా 8 వారాలు కూడా థియేటర్లలో ఉంచాలి అనే బడా నిర్మాతలు సైతం ఎన్నో మాటలు చెప్పారు.
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ రూల్స్ గాని మాటలు గాని గాలికి వదిలేసారు అని అనిపిస్తోంది. పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు, హిట్ అయిన సినిమాలు.. డిజాస్టర్ సినిమాలు అన్ని కూడా ఓటిటి సంస్థల డిమాండ్కు తగ్గట్టుగానే ముందుగానే ప్రసారం అవుతున్నాయి. చాలా తక్కువ టైంలోనే ఇటీవల డిజాస్టర్ అయిన భోళా శంకర్ సినిమాతో పాటు గాండీవ దారి అర్జున రెండు కూడా ఓటీటీలోకి వచ్చేసాయి.
అలాగే బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన జైలర్ కూడా ముందుగానే వచ్చేసింది. ఇక ఇప్పుడు ఖుషి సినిమా ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది అనుకుంటే ముందుగానే వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు 12 కోట్ల రేంజ్ లో అయితే నష్టాలు మిగిలాయి. ఇక ఓటిటి సంస్థల ఆఫర్స్ కు ఎంతో కొంత నష్టాలను భర్తీ చేసే విధంగా ప్రీమియర్స్ కు ముందుగానే పర్మిషన్స్ చేస్తున్నారు. మొత్తానికి ఓటీటీ థియేటర్ల బిజినెస్ ను మింగేస్తోంది దీనిపై పోరాటం చేయాలి అనే మాటలు భవిష్యత్తులో పెద్దగా మళ్లీ వినిపించకపోవచ్చు అని అర్థమవుతుంది.