టాలీవుడ్ కి కియారా ఇక కష్టమేనా?
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాలో సంచలనం అవుతుందనుకుంటే? అమ్మడి కెరీర్ మాత్రం మరోలా సాగుతోంది.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాలో సంచలనం అవుతుందనుకుంటే? అమ్మడి కెరీర్ మాత్రం మరోలా సాగుతోంది. ఇప్పటి వరకూ తెలుగులో మూడు సినిమాలు చేసింది. అందులో ఒకటి మాత్రమే హిట్ అయింది. అదే `భరత్ అనే నేను`. మిగిలిన రెండు చిత్రాలు `వినయ విధేయ రామ`, `గేమ్ ఛేంజర్` చిత్రాలు డిజాస్టర్లగా మారిన సంగతి తెలిసిందే. ప్లాప్ చిత్రాలు కూడా రామ్ చరణ్ తో నటించినవే.
దీంతో రామ్ చరణ్ అమ్మడికి ఓ ప్లాప్ సెంటిమెంట్ గానూ మారిపోయాడు. అయితే ఈ సెంటిమెంట్ ఇక్కడితో అగిపోదు. తదుపరి కూడా కొనసాగుతుంది. ఎందుకంటే టా లీవుడ్ లో సెంటిమెంట్ ని దర్శక, నిర్మాతలు బలంగా నమ్ముతారు. సక్సెస్ ఉన్న భామలకే అవకాశాలివ్వడానికి చూస్తారు. శంకర్ లా ప్లాప్ వచ్చిందని పట్టించుకోకుండా ఛాన్సులిచ్చే టాలీవుడ్ డైరెక్టర్లు చాలా అరుదు. ఈ నేపథ్యంలో కియారాకి టాలీవుడ్ లో ఇకపై అవకాశాలు కష్టమే అన్న మాట బలంగా వినిపిస్తుంది.
సాధారణంగా టాలీవుడ్ లో సక్సెస్ అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. ఫేం ఫాం ఉన్న భామలనే దర్శకులు హీరోయిన్లగా తీసుకుంటారు. మార్కెట్ లో స్టార్ డమ్ని బేస్ చేసుకుంటారు. ఆ ప్రకారమే పారితోషికం ఇచ్చి సకల సౌకర్యాలు కల్పిస్తారు. సక్సెస్ లేని భామల వైపు తెలుగు దర్శకులు చూసే పరిస్థితి ఉండదు. ఒకవేళ దర్శకుడు కన్విన్స్ అయినా? హీరో, నిర్మాత అందుకు ఒప్పుకునే పరిస్థితి ఉండదు.
ముఖ్యంగా హీరోయిన్ ఎంట్రీ విషయంలో హీరో కీలక పాత్ర పోషిస్తాడు. తన పక్కన ఏ హీరోయిన్ నటించాలన్నది హీరోనే డిసైడ్ చేస్తాడు. బాగా పాపులర్ అయిన డైరెక్టర్ అయితే హీరోయిన్ ఛాయిస్ అన్నది తన చేతుల్లో ఉంటుంది తప్ప! లేదంటే అందుకు ఛాన్స్ ఉండదు. శంకర్ అలాగే కియారాని `గేమ్ ఛేంజర్` లో కి తీసుకొచ్చాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కియారాకి కొత్త ఛాన్సులు రావడం కష్టమే.