ఆమె పారితోషికం... 4.. 7.. 13 కోట్లు
సినిమా స్థాయి మరియు అందుకోసం ఆమె కేటాయించాల్సిన డేట్లు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని రూ.13 కోట్ల పారితోషికంను కియారా డిమాండ్ చేసిందట.
బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ. తెలుగు లో ఈ అమ్మడు భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వినయ విధేయ రామ సినిమా నిరాశ పరచడంతో కాస్త గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ అమ్మడి పారితోషికం ఈ మధ్య కాలంలో అలా అలా పెరుగుతూ పీక్స్ కు వెళ్లిందని బాలీవుడ్ మీడియా వర్గాల్లో కథనాలు ప్రచారం జరుగుతున్నాయి. బాలీవుడ్ మీడియా వర్గాల ప్రచారం మేరకు రామ్ చరణ్ తో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం కియారా అద్వానీ రూ.4 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
ఇటీవల కియారా అద్వానీ వార్ 2 సినిమాకు ఓకే చెప్పింది. ఆ సినిమాలో నటించేందుకు గాను కియారా అద్వానీ ఏకంగా రూ.7 కోట్ల రూపాయలను డిమాండ్ చేసింది. ఆమెకు ఉన్న క్రేజ్ మరియు పాన్ ఇండియా గుర్తింపు కారణంగా ఆ మొత్తంను ఇచ్చేందుకు వార్ 2 మేకర్స్ ఒప్పుకున్నారు.. ఆమె సైన్ కూడా పెట్టేసిందని తెలుస్తోంది.
ఇప్పుడు కియారా అద్వానీ పారితోషికం మరింతగా పెరిగినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రణ్వీర్ సింగ్ నటించబోతున్న డాన్ 3 సినిమాలో కియారా అద్వానీ నటించబోతుంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర అవ్వడంతో పాటు బికినీ లో కూడా కనిపించాల్సి ఉంటుందట.
సినిమా స్థాయి మరియు అందుకోసం ఆమె కేటాయించాల్సిన డేట్లు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని రూ.13 కోట్ల పారితోషికంను కియారా డిమాండ్ చేసిందట. ఆమె డిమాండ్ కు డాన్ 3 మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు త్వరలోనే ఆమెకు వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
రెండు సంవత్సరాల గ్యాప్ లో కియారా అద్వానీ పారితోషికం అమాంతం పెరిగింది. సౌత్ లో స్టార్ హీరోయిన్స్ కు రెండున్నర నుంచి మూడు కోట్ల పారితోషికం ఇవ్వడం గొప్ప విషయం. అలాంటిది కియారా అద్వానీ డాన్ 3 కి తీసుకోబోతున్న రూ.13 కోట్ల పారితోషికం అందరికి సర్ప్రైజింగ్ గా ఉంది. ముందు ముందు కియారా అద్వానీ పారితోషికం లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.