ట్వింకిల్ ఖన్నా పుస్తకావిష్కరణలో కియరా
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కియరా అద్వాణీ షో స్టాపర్ గా నిలిచింది.
నటి కం బెస్ట్ సెల్లింగ్ రచయిత, కాలమిస్ట్ ట్వింకిల్ ఖన్నా బుధవారం తన నాల్గవ పుస్తకం 'వెల్‌కమ్ టు ప్యారడైజ్` (జగ్గర్నాట్)ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కియరా అద్వాణీ షో స్టాపర్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆమె భర్త అక్షయ్ కుమార్, తల్లి డింపుల్ కపాడియా, చిత్ర నిర్మాత కరణ్ జోహార్, నటీమణులు విద్యాబాలన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్‌లో కియారా అద్వానీ తన లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. వైట్ ట్యాంక్ టాప్‌తో లిలక్ పింక్ కో-ఆర్డ్ సెట్‌లో కియారా పిక్చర్ పర్ఫెక్ట్‌గా కనిపించింది. అక్కడ సింపుల్ మేకప్ తో కనిపించింది. కియారా తన చేతిలో పుస్తకంతో విభిన్నమైన పోజులు ఇచ్చింది. కియారా తన సినిమాల కోసమే కాకుండా తన లుక్స్ విషయంలో కూడా వార్తల్లో నిలుస్తోంది. కియారా అద్వానీ తన 8 సంవత్సరాల సినీ కెరీర్‌లో బాలీవుడ్‌కి 7 హిట్ చిత్రాలలో నటించింది. `సత్యప్రేమ్ కి కథ సినిమా హిట్ అయింది. కియారా పనితనానికి చాలా ప్రశంసలు దక్కాయి.
కియరా ఇటీవల ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కియరా సౌత్ లో స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీ గేమ్ ఛేంజర్ మినహా ఇతర ప్రాజెక్టులేవీ లేవు. అటు బాలీవుడ్ లో అడపాదడపా నటిస్తోంది.
ట్వింకిల్ ఖన్నా నాల్గవ పుస్తకం:
నటి, బెస్ట్ సెల్లింగ్ రచయిత, కాలమిస్ట్ ట్వింకిల్ ఖన్నా తన నాల్గవ పుస్తకం 'వెల్‌కమ్ టు ప్యారడైజ్` (జగ్గర్నాట్)ని బుధవారం నాడు ఆవిష్కరించారు. వెల్‌కమ్ టు ప్యారడైజ్ అనేది ఒంటరితనం, హృదయ విదారక మైన మోసం తాలూకా లోతును అన్వేషించే గొప్ప కథనాలను అందిస్తుంది. కుటుంబ బంధాలు సహా స్నేహం ఇతర విషయాలను ఈ కథల్లో ఆవిష్కరించారు.
2015లో, ట్వింకిల్ తన మొదటి నాన్-ఫిక్షన్ పుస్తకాన్ని విడుదల చేసింది. 'మిసెస్ ఫన్నీబోన్స్` తో రచయితగా పాపులరయ్యారు. ట్వింకిల్ ఖన్నా రెండవ పుస్తకం `ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్`. చిన్న కథల సంకలనం.. అందులో ఒకటి సామాజిక వ్యవస్థాపకుడు అరుణాచలం మురుగానందం ఆధారంగా రూపొందించారు. ఇది R. బాల్కీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్-నటించిన `ప్యాడ్ మ్యాన్`కి ప్రేరణగా మారింది. ట్వింకిల్ నుంచి వచ్చిన చివరి పుస్తకం `పైజామాస్ ఆర్ ఫర్గివింగ్`.