"కింగ్‌డమ్" యూఎస్ బిజినెస్.. ఎంత వస్తే హిట్?
గతకొంత కాలంగా వరుస ఫ్లాప్స్ తో కాస్త నిరాశపరుస్తున్న విజయ్ దేవరకొండ ఈసారి మాస్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
గతకొంత కాలంగా వరుస ఫ్లాప్స్ తో కాస్త నిరాశపరుస్తున్న విజయ్ దేవరకొండ ఈసారి మాస్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. లేటెస్ట్ మూవీ "కింగ్‌డమ్" మార్కెట్‌లో హంగామా చేస్తోంది. యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమా లేటెస్ట్ బిజినెస్ నెంబర్స్ చూస్తే, ది ఫ్యామిలీ స్టార్ కన్నా మరింత మంచి రేటుకు అమ్ముడైందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఓవరాల్‌గా ఈ సినిమా మీద ఉన్న అంచనాలను చూస్తే, ఇది విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదే కాకుండా, ఈ చిత్రానికి ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఇంటెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ మాస్ లుక్, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, అనిరుద్ సంగీతం ఇవి కలిసి టీజర్‌కి స్పెషల్ మాస్ అట్రాక్షన్ కల్పించాయి. ఇక తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు, అంటే మేకర్స్ ఏ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతోంది.
ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గత రెండు సినిమాలు లైగర్, ది ఫ్యామిలీ స్టార్ ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయాయి. కానీ "కింగ్‌డమ్" మాత్రం ఆ గ్యాప్‌ను సరి చేయనుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, KGF రేంజ్‌లో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందని మేకర్స్ చెబుతున్నారు. "జెర్సీ" తర్వాత గౌతమ్ తిన్ననూరి చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రస్తుతం మీడియం హీరోలతో కూడా సితార బ్యానర్ బిగ్ బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అంతే కాకుండా, ఈ చిత్రానికి యూఎస్ మార్కెట్‌లో భారీ బిజినెస్ జరగడమే కాకుండా, ఓవర్సీస్ హక్కులు కూడా మంచి రేట్స్‌కు అమ్ముడయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో యూఎస్ బాక్సాఫీస్‌ను డామినేట్ చేయగల హీరోల్లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడనే టాక్ నడుస్తోంది. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో అక్కడ మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న విజయ్, ఇప్పుడు కింగ్‌డమ్ సినిమాతో మళ్లీ తన క్రేజ్‌ను పెంచుకోవాలని చూస్తున్నాడు.
ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. టీజర్ రేంజ్ చూస్తుంటే, ఈ సినిమా విజువల్ ట్రీటింగ్ కూడా అదిరిపోతుందని చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో అనిరుధ్ తనదైన మార్క్ చూపించగా, సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్‌గా ఉంటుందని సమాచారం. మేకర్స్ సినిమాను మే 30న గ్రాండ్ రీలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి, విజయ్ దేవరకొండ హైప్ తగ్గిందనే చెప్పుకునే టైమ్‌లో "కింగ్‌డమ్" బిజినెస్ రికార్డులు కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. యూఎస్ మార్కెట్ నుంచే ఇలా 2 మిలియన్ డాలర్లకు పైగా అమ్ముడైన ఈ సినిమా, విడుదల తర్వాత 2.5 మిలియన్ అందుకుంటేనే హిట్ అయినట్లు లెక్క.