అల్లు అయాన్‌కి ట్విస్ట్ ఇచ్చిన కింగ్ ఖాన్

అల్లు అయాన్ డాడీకి వార‌సుడిగా దూకుడు ఉన్న కుర్రాడు అని అర్థ‌మ‌వుతోంది.

Update: 2024-02-26 03:47 GMT

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ తనయుడు మాస్ట‌ర్ అల్లు అయాన్ అల్ల‌రి నెమ్మ‌దిగా బ‌య‌ట‌ప‌డుతోంది. అత‌డి గారాల ప‌ట్టీ అల్లు అర్హ అల్ల‌రి వేషాల‌ ముందు ఇంకెవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డంతో అయాన్ చాలా నెమ్మ‌దస్తుడైన బాల‌కుడు అని భావించారు. కానీ అలా కాద‌ని అయాన్ ఇప్పుడు నెమ్మ‌దిగా ప్రూవ్ చేస్తున్నాడు. అల్లు అయాన్ డాడీకి వార‌సుడిగా దూకుడు ఉన్న కుర్రాడు అని అర్థ‌మ‌వుతోంది.

అయాన్ ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన డంకీ నుంచి 'లుట్ పుట్ గయా..' పాట‌ను పాడుతూ కార్‌లోనే డ్యాన్సింగ్ మూవ్స్ తో శ‌రీరాన్ని క‌దుపుతూ ఆనందించిన‌ వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చివ‌రికి చిత్ర‌క‌థానాయ‌కుడు షారూఖ్ ఖాన్‌ కి చేరింది. సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ చిన్నపిల్లాడైన అయాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.. ఆదివారం షారుఖ్ ఖాన్ అల్లు అర్జున్‌ను ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి, ''ధన్యవాదాలు లిల్ వన్… మీరు పువ్వు మరియు అగ్ని.. రెండూ ఒకదానిలో ఒకటిగా మారాయి!!! ఇప్పుడు నా పిల్లలను అల్లుఅర్జున్ శ్రీవల్లి పాట‌ను పాడటం ప్రాక్టీస్ చేయిస్తున్నాను... హ హ'' అంటూ జోష్‌ఫుల్ గా వ్యాఖ్యానించారు.

అల్లు అయాన్ నిజానికి ఈ పాట పాడుతూ షారూఖ్ పై త‌న అభిమానం చాటుకున్నాడు. అయాన్ కారులో కూర్చుని లుట్ పుట్ గయా పాటను పాడుతున్నాడు. ఈ క్లిప్‌లో మ‌ల్టీక‌ల‌ర్ జెర్సీని ధరించి చేతిలో వాటర్ బాటిల్‌తో క‌నిపించాడు. పాటను ఉత్సాహంగా పాడటమే కాకుండా కార్ లోనే బాడీ మూవ్ మెంట్ డ్యాన్సింగ్ కి ప్ర‌య‌త్నించాడు. ఆ పాట‌ను అత‌డు చాలా ఎంజాయ్ చేస్తున్నాడ‌ని ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ లుట్ పుట్ గయా వెర్షన్ అనే క్యాప్షన్‌తో అభిమానుల పేజీ X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో వీడియోను షేర్ చేయ‌గా ఇది వైర‌ల్ అయింది.

గత సంవత్సరం షారుఖ్ ఖాన్ 'జవాన్'ని అల్లు అర్జున్ ఎక్స్ ఖాతాలో స‌మీక్షిస్తూ షారూఖ్ టీమ్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. బ‌న్ని వ్యాఖ్యానిస్తూ.. ''భారీ బ్లాక్‌బస్టర్ సాధించిన‌ JAWAN టీమ్ మొత్తానికి అభినందనలు. జవాన్ మొత్తం తారాగణం, సాంకేతిక నిపుణులు, సిబ్బంది, నిర్మాతలకు హృదయపూర్వక నమస్కారాలు. SRK అత్యంత భారీ అవతార్.. యావత్ భారతదేశాన్ని ఊపేసే ఛామ్ ఆక‌ర్షించాయి. మీ విజ‌యానికి నిజంగా సంతోషంగా ఉంది సార్.. మేము మీ కోసం ప్రార్థించాము'' అని విష్ చేసారు.

అల్లు అర్జున్ పోస్ట్‌కి రిప్లై ఇస్తూ, షారుక్ ఖాన్ ''చాలా ధన్యవాదాలు..మై మ్యాన్.. మీ ప్రేమ ప్రార్థనలు ద‌య అబ్బుర‌ప‌రిచాయి. ఛామ్ విషయానికి వస్తే 'ది ఫైర్' స్వయంగా నన్ను ప్రశంసించింది... వావ్... ఇది నా రోజు.. జవాన్‌ని ఇప్పుడు రెండుసార్లు అనుభూతి చెందుతున్నాను! మూడు రోజుల్లో పుష్పను మూడుసార్లు చూసాను కాబట్టి నేను మీ నుండి ఏదో నేర్చుకున్నానని ఒప్పుకోక తప్పదు! మీకు బిగ్ హగ్ .. వీలైనంత త్వరగా వచ్చి వ్యక్తిగతంగా మీకు ఒకటి ఇస్తాను. కీప్ స్వాగింగ్.. ల‌వ్ యు'' అని రిప్లై ఇచ్చారు.

షారూఖ్ ఖాన్ చివరిసారిగా రాజ్‌కుమార్ హిరాణీ 'డంకీ'లో కనిపించగా, అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్‌'తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆగస్ట్ 15న ఈ సినిమా భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags:    

Similar News