‘క 2’.. కిరణ్ అబ్బవరం క్లారిటీ
కిరణ్ అబ్బవరం.. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా రంగంలో హాట్ టాపిక్ అవుతోన్న హీరో పేర్లలో ఇది ఒకటి.
కిరణ్ అబ్బవరం.. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా రంగంలో హాట్ టాపిక్ అవుతోన్న హీరో పేర్లలో ఇది ఒకటి. అంతలా అతడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అయితే, ఆరంభంలో మాదిరిగా ఇటీవలి కాలంలో హిట్లు అందుకోవడం లేదు. దీంతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో కిరణ్ అబ్బవరం ‘క’ మూవీని చేశాడు.
కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కోసం వేచి చూస్తోన్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీనే ‘క’. సందీప్, సుజిత్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా డిఫరెంట్ థ్రిల్లింగ్ స్టోరీతో వచ్చింది. దీనికితోడు ప్రచార చిత్రాలతోనూ ఇది బాగానే ఆకట్టుకుంది. ఫలితంగా ఇది మంచి హైప్ క్రియేట్ చేసుకుని దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘క’ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు కిరణ్ అబ్బవరంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో మొదటి రోజు ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను అందుకుంది. ఇక, రెండో రోజు అయితే మరింతగా పుంజుకుని ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. ఇలా ఈ సినిమా టార్గెట్‌ను చేరుకునే దిశగా సాగుతోంది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో శనివారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా మూవీ సక్సెస్‌పై హీరో కిరణ్ అబ్బవరం సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఎన్నో కీలకమైన విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలోనే ‘క’ మూవీ సీక్వెల్‌పై తొలిసారి స్పందించాడు.
తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో మీడియా నుంచి ‘క’ మూవీ సీక్వెల్‌పై ప్రశ్న ఎదురు కావడంతో కిరణ్ అబ్బవరం ‘క మూవీకి సీక్వెల్ ఉంటుంది. దీనిపై కేవలం ఒకే ఒక్క వారం రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుంది. మా డైరెక్టర్ల దగ్గర గ్రేట్ ఐడియా కూడా ఉంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు అందరూ ‘క 2’ గురించి చర్చించుకుంటున్నారు. దీంతో ఇది హాట్ టాపిక్ అయిపోయింది.
ఇక, క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ‘క’ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణా రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే, ఈ సినిమాలో అచ్యుత్ కుమార్, అన్నపూర్ణ, అజయ్, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సామ్ సీఎస్ దీనికి సంగీతం సమకూర్చారు.