అబ్బవరం 'దిల్‌రూబా' ట్రైలర్ టాక్.. ఎలా ఉందంటే?

టాలీవుడ్‌లో తనదైన మార్క్‌తో ముందుకు సాగుతున్న కిరణ్ అబ్బవరం, మరోసారి కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.;

Update: 2025-03-06 11:36 GMT

టాలీవుడ్‌లో తనదైన మార్క్‌తో ముందుకు సాగుతున్న కిరణ్ అబ్బవరం, మరోసారి కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల ‘క’ మూవీతో హిట్ అందుకున్న అతను, ఇప్పుడు పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘దిల్‌రూబా’లో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. లవ్ ఎమోషనస్ పాటు విభిన్న యాక్షన్ కథాంశంతో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

రొమాంటిక్ జానర్‌లో కొత్తగా సినిమాలను మలచడం చాలా కష్టం. కానీ ‘దిల్‌రూబా’ ట్రైలర్ చూస్తే ఈ కథలో కాస్త కొత్తదనం కనిపిస్తోంది. హీరో కిరణ్ అబ్బవరం లవ్ స్టోరీని ఒక కొత్త యాంగిల్‌లో చూపించేందుకు దర్శకుడు విశ్వకరణ్ ప్రయత్నించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక రుక్సర్ ధిల్లాన్ గ్లామర్, నటన ఇద్దరూ కలిసి తెరపై కొత్త జంటగా కనిపించేలా ఉంది.

ట్రైలర్ స్టార్టింగ్ లో సముద్రం ఒడ్డున ఉన్న హీరో హీరోయిన్ డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. హీరోయిన్ సారీ రా సిద్ధు అని చెప్పడంతో, తప్పు చేసిన తరువాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయాక చెప్పే థాంక్స్ కి.. నా దృష్టిలో వాల్యూ లేదు అంటూ హీరో సిద్ధు క్యారెక్టర్ చెప్పిన విధానం హైలెట్ అవుతోంది. ఇక ఆ తరువాత కాలేజ్ లవ్ గొడవలు అనంతరం ఫ్యామిలీ డ్రామా లాంటి అంశాలు కూడా సినిమాలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తప్పు చేయనప్పుడు సారీ చెప్పను అంటూ హీరో యాక్షన్ అటిట్యూడ్ కనిపిస్తోంది. అలాగే విలన్స్ తో తప్పు చేయని వాడు హీరోనే అంటూ డైలాగ్ చెప్పడం, ఆ తరువాత కోపంగా హైలెట్ అవ్వడ చూస్తుంటే సినిమాలో కిరణ్ చాలా అగ్రెసివ్ మోడ్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక లవ్ ఎమోహన్స్ యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉంది. ఫైట్స్ తో మరోసారి కిరణ్ యాక్షన్ టచ్ ఇస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘కన్నా నీ’ అనే పాట నెటిజన్లను బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ చేసింది. సినిమా ఎమోషనల్ ఫీల్‌ను ట్రైలర్‌లో కూడా చక్కగా మిళితం చేశారు. సామ్ సీఎస్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మేజర్ హైలైట్ అయ్యింది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద క్యూరియాసిటీ మరింత పెరిగింది. కిరణ్ అబ్బవరం, రుక్సర్ ధిల్లాన్ జంట ఎలా వర్కౌట్ అవుతుందో, ఈ ఎమోషనల్ రొమాంటిక్ కథ ప్రేక్షకుల మనసును ఎంతవరకు టచ్ చేస్తుందో చూడాలి. ‘దిల్‌రూబా’ మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది.

Full View
Tags:    

Similar News