ఆడియన్స్ డిమాండ్.. ఫుల్ సాంగ్ గా 'దిల్ రుబా' థీమ్ మ్యూజిక్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం.. రీసెంట్ గా 'క' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం.. రీసెంట్ గా 'క' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దిల్ రూబా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మనసుని హత్తుకునే ప్రేమ కథతో కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ తెరెకక్కిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
శివం సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ నిర్మాణ సంస్థ అయిన ఏ యూడ్లీ ఫిల్మ్స్ సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. త్వరలోనే సినిమా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పుడు ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో అలరిస్తున్నారు.
అందులో భాగంగా రీసెంట్ గా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మ్యాగీ మై ఫస్ట్ లవ్ అంటూ కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. లవ్ అండ్ యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ థీమ్ మ్యూజిక్ అదిరిపోయాయనే చెప్పాలి.
సామ్ సీఎస్ వర్క్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. రిపీట్ మోడ్ లో టీజర్ ను కన్నానే అంటూ సాగుతున్న థీమ్ మ్యూజిక్ కోసం వింటున్నారు. అంతలా కనెక్ట్ అయ్యారు. మైండ్ లో నుంచి పోవడం లేదని నెటిజన్లు చెబుతున్నారు. ఎన్ని సార్లు విన్నా.. వినాలనిపిస్తుందని అంటున్నారు. సూపరో సూపర్ అని చెబుతున్నారు.
సామ్ సీఎస్ అందించిన థీమ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉందని అంతా కొనియాడుతున్నారు. అలా అత్యంత ప్రజాదరణ పొందిన థీమ్ మ్యూజిక్ ఇప్పుడు ఫిబ్రవరి 28న పూర్తి పాటగా విడుదలవుతోంది. ఆడియన్స్ డిమాండ్ తో పూర్తి పాట వెర్షన్ ను తీసుకువస్తున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో అంతా వెయిటింగ్ అని చెబుతున్నారు.
అయితే సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు మార్చి 14వ రిలీజ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట. అంతకుముందే కన్నానే పాటను విడుదల చేయనున్నారు మేకర్స్.