కిరణ్ అబ్బవరం దిల్ రూబా రిలీజ్ డేట్ లాక్ చేశారోచ్..!

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Update: 2025-02-15 14:26 GMT

క సినిమా హిట్ తో కెరీర్ లో సూపర్ కాన్ఫిడెన్స్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ సినిమా దిల్ రూబాతో రాబోతున్నాడు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. దిల్ రూబా టీజర్ తోనే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోఈ విత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.


ఒక సినిమా హిట్ కొట్టిన వెంటనే నెక్స్ట్ రాబోతున్న సినిమా మీద అంచనాలు భారీగా ఉంటాయి. ఐతే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దిల్ రూబా ఉంటుందని తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేశారు మేకర్స్. మార్చి 14న దిల్ రూబా రిలీజ్ ఫిక్స్ చేశారు. మార్చి రెండో వారం అంటే సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరికినట్టే లెక్క.

దిల్ రూబా లో కిరణ్ అబ్బవరం కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో యాక్షన్ హీరోగా కూడా కిరణ్ క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాడు. కిరణ్, రుక్సర్ జోడీ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. విశ్వ కరుణ్ దిల్ రూబా సినిమాను చాలా బ్రిలియంట్ గా ఆడియన్స్ ని మెప్పించేలా తెరకెక్కించారని అంటున్నారు. దిల్ రూబా సినిమాను శివమ్ సెల్యులాయిడ్స్ బ్యానర్ లో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సరెగమ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు.

క తో హిట్ టాక్ ఎక్కిన కిరణ్ అబ్బవరం దిల్ రూబాతో కూడా ఆ సక్సెస్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. మార్చి 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. దిల్ రూబా సినిమా టీజర్ రిఫ్రెషింగ్ గా ఉండగా సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది రిలీజ్ నాడు తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం దిల్ రూబా టీజర్ తోనే ఆడియన్స్ లో డిస్కషన్ మొదలుకాగా ఈ క్రేజ్ సినిమా రిలీజ్ టైం కు మరింత పెరిగేలా ఉంది.

Tags:    

Similar News