అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే..!

చిన్నప్పటి నుంచి అమ్మ మా కోసం చాలా కష్టపడ్డదని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు.

Update: 2024-11-10 12:30 GMT

క సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఆ సినిమా హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేని కిరణ్ అబ్బవరం తనకు తానుగా ఎలాగైనా నిరూపించుకోవాలని చెప్పి సినిమాల్లోకి వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డ కిరణ్ అబ్బవరం నేడు ఈ స్థాయికి రావడానికి అమ్మ ఇచ్చిన ధైర్యం, స్పూర్తి కారణమని అంటున్నాడు. చిన్నప్పటి నుంచి అమ్మ మా కోసం చాలా కష్టపడ్డదని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు.

కడప జిల్లా రాయచోటి దగ్గర్లో ఉన్న పెద్ద కొడివండ్లపల్లి లో రైతు కుటుంబం నుంచి వచ్చిన కిరణ్ అబ్బవరం తన జీవితంలో ఏది అంత ఈజీగా రాలేదని అంటున్నాడు. పేద కుటుంబం అవ్వడం వల్ల చదువుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని. ఒక దశలో అమ్మ పుస్తెలు అమ్మి చదివించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు.

నాతో పాటు అన్నయ్య బాగా చదుకోవాలని అమ్మ కువైట్ వెళ్లి అక్కడ ఉద్యోగం చేసి మాకు డబ్బులు పంపించేదని చెప్పారు. అన్న పెద్దవాడై ఉద్యోగం చేస్తున్న టైం లో అప్పులన్నీ తీర్చి అమ్మ ఒక ఇల్లు కూడా కొన్నది. తాను చదువుకుంటున్న టైం లో అన్నయ్య తనకు నెలకు నాలుగైదు వేల దాకా పంపించాడని చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం.

బీటెక్ అనంతరం బెంగళూరులో జాబ్ చేస్తుండే వాడిని.. ఉద్యోగం మీద అంతగా ఆసక్తి అనిఒపించేది కాదు ఒకసారి నా సీనియర్ సినిమాల మీద ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే వాడు. అతని వల్ల సినిమాల మీద ఆసక్తి కలిగింది. అలా హైదరాబాద్ కి వచ్చి చిన్న రూం లో అద్దెకి ఉన్నాను. సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగాను. అలా రాజా వారు రాణి గారు ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఫ్రెండ్స్ తో కలిసి ఎస్.ఆర్ కళ్యాణ మండపం సినిమా చేశాం. ఆ సినిమాకు అన్నయ్య ఐదు లక్షల దాకా ఆర్ధిక సాయం అందించారని చెప్పారు కిరణ్ అబ్బవరం.

ఆ తర్వాత సెబాస్టియన్, వినరో భాగ్యము విష్ణు కథ, రూల్స్ రంజన్, మీటర్ వరుస ఆఫర్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. సెబాస్టియన్ టైం లోనే అన్నయ్య రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. తను కూడా నటించాలని ఉందని చెప్పాడు. కానీ అది జరగకుండానే వెళ్లిపోయాడని.. అది ఒక్కటి తనని బాధ పెడుతుందని అన్నారు కిరణ్ అబ్బవరం.

రహస్య గోరక్ తో రాజా వారు రాణి గారు సినిమా చేశా. అప్పటి నుంచి తను చాలా సపోర్ట్ గా ఉంది. స్నేహితురాలిగా బాగా అర్ధం చేసుకుంది. అమ్మకి బాగా నచ్చింది. అలా ఇద్దరం ఒకటయ్యామని చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం.

Tags:    

Similar News