కిరణ్ అబ్బవరం మాస్ జాతర లోడింగ్

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి సంబందించిన అప్డేట్ వచ్చింది. ఆదివారం సాయంత్రం 7:29 గంటలకి జాతర బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన మొదటి పాటని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

Update: 2024-10-05 06:43 GMT

కిరణ్ అబ్బవరం చాలా గ్యాప్ తీసుకొని విభిన్న కథాంశంతో చేసిన మూవీ 'క'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమాని చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. కచ్చితంగా కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకుంటానని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి సంబందించిన అప్డేట్ వచ్చింది. ఆదివారం సాయంత్రం 7:29 గంటలకి జాతర బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన మొదటి పాటని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. కిరణ్ అబ్బవరం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రోమో రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. మంచి డాన్స్ మూమెంట్స్ తో అదిరిపోయే రేంజ్ లో ఈ సాంగ్ ఉండబోతోందని ప్రోమో బట్టి అర్ధమవుతోంది.

సామ్ సిఎస్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఆడు ఆడు ఆడు నిలువెల్ల పూనకమై.. అంటూ సాగే ఈ పాట కచ్చితంగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. కిరణ్ అబ్బవరం మాస్ జాతర అంటూ ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ పాటతో 'క' మూవీకి ఊపొస్తుందని భావిస్తున్నారు. నవంబర్ 18న పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

సుజిత్ మద్దెల, సందీప్ మద్దెల 'క' మూవీతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. KA ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిరణ్ అబ్బవరం ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. కిరణ్ అబ్బవరం ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుండటంతో కచ్చితంగా కిరణ్ కు సక్సెస్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఈ మధ్యకాలంలో పీరియాడికల్ థ్రిల్లర్ మూవీస్ కి తెలుగునాట మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే కిరణ్ అబ్బవరం కూడా ఇదే జోనర్ లో 'క' మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాలో తన్వి రామ్, నాయన సారిక హీరోయిన్స్ గా నటించారు. కిరణ్ అబ్బవరం చివరిగా రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత గ్యాప్ తీసుకొని 'క' తో బౌన్స్ బ్యాక్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News