'నరేష్ అన్న బెస్ట్ ఇచ్చారు.. స్టార్ ట్యాగ్ ఇవ్వాల్సిందే..'
అయితే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా బచ్చల మల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా సందడి చేసి వేదికపై మాట్లాడారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లరి నరేష్.. బచ్చల మల్లి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ ద్వారా సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 20వ తేదీన అల్లరి నరేష్ హిట్ కొట్టనున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అదే సమయంలో మేకర్స్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. అనేక మంది దర్శకులు గెస్టులుగా వచ్చేశారు.
అయితే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా బచ్చల మల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా సందడి చేసి వేదికపై మాట్లాడారు. ఇంతమంది తెలుగు దర్శకులను ఒకే వేదికపై చూడడం సంతోషంగా ఉందని తెలిపారు. బచ్చల మల్లి నిర్మాత రాజేష్ మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని కిరణ్ అబ్బవరం ప్రశంసించారు.
రాజేష్ తో కొంతకాలంగా ట్రావెల్ చేస్తున్నానని, ఆయన సినిమాలు మంచి హిట్స్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బచ్చల మల్లి మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పారు. తాను ఫస్ట్ కలిసిన హీరో అల్లరి నరేష్ వెల్లడించారు. ఓ హాలీ డే ట్రిప్ కు వెళ్లగా.. తాను ఫస్ట్ టైమ్ ఒక హీరోను చూశానని పేర్కొన్నారు.
ఇప్పుడు ఆయన పక్కన కూర్చోవడం హ్యాపీగా ఉందని చెప్పారు. 2008లో మంచి హిట్స్ అందుకున్నారని, మళ్లీ అల్లరి నరేష్ కు ఆ టైమ్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 22 ఏళ్లకు పైగా బహుముఖ ప్రదర్శనలిచ్చారని, కానీ ఆయనకు స్టార్ ట్యాగ్ ఇవ్వాలి కదా.. ఆయన ఇప్పటికే ఆడియన్స్ కు బెస్ట్ ఇచ్చారని కిరణ్ అబ్బవరం అన్నారు.
"నరేష్ అన్నకు స్టార్ ట్యాగ్ ఎందుకు రాలేదని డైరెక్టర్ ను అడిగా.. ఆయన అన్ని వేరియేషన్స్ చూపించడం కష్టం.. ఆయనకు ఇష్టమోలేదో తెలియదుగానీ స్టార్ ట్యాగ్ ఇవ్వాలని ఒక అభిమానిగా కోరుకుంటున్నా. ఆయనకు ఆ అర్హత ఉంది" అని కిరణ్ అబ్బవరం తెలిపారు. మరి అల్లరి నరేష్ కు త్వరలో ఏమైనా ట్యాగ్ వస్తుందేమో చూడాలి.