మ‌న లైఫ్ లోకి మ‌ళ్లీ మాజీ ల‌వ‌ర్ వ‌స్తే!

రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.;

Update: 2025-03-07 03:37 GMT

కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా విశ్వ క‌రుణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా దిల్ రూబా. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా దిల్ రూబా ట్రైల‌ర్ ను రిలీజ్ చేసింది. ఈ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీడియాతో ప‌లు విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు.

కిర‌ణ్ సినిమాల్లో ఎప్పుడూ లేనంత యాక్ష‌న్ ఈ ట్రైల‌ర్ లో క‌నిపించ‌డంతో యాక్ష‌న్ హీరో అవాల‌నుకుంటున్నారా అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు త‌న‌కు యాక్ష‌న్ హీరో అవాల‌నే డ్రీమ్ ఉన్న‌ట్టు కిర‌ణ్ తెలిపారు. దాని కోసం ఎంతో ట్రై చేశాన‌ని, అంద‌రికీ న‌చ్చుతుంద‌నుకున్నాన‌ని అన్నారు. అయితే త‌న కోరిక కోసం సినిమాలో ఎక్క‌డా యాక్ష‌న్ ను పెట్ట‌లేద‌ని, క‌థ‌లో భాగంగానే దిల్ రూబాలో యాక్ష‌న్ ఉంటుంద‌ని కిర‌ణ్ చెప్పారు.

ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాన‌ని కొంద‌రనుకుంటున్నార‌ని, అందులో ఏ మాత్రం నిజం లేద‌ని, సిక్స్ ప్యాక్ అంత ఈజీగా వ‌చ్చేయ‌ద‌ని, 2027లో తాను ఓ సినిమాలో ఫిష‌ర్ మ్యాన్ గా క‌నిపిస్తాన‌ని, ఆ సినిమా కోసం బాడీ ఫిట్‌నెస్‌పై ఫోక‌స్ చేస్తున్నా అని మాత్ర‌మే చెప్పాన‌ని, అది అంద‌రికీ వేరేలా అర్థ‌మైంద‌ని కిర‌ణ్ తెలిపారు.

సినిమా రిలీజ‌య్యాక ఇందులోని సిద్ధూ క్యారెక్ట‌ర్ ను కొంత‌మంది ఫాలో అవుతార‌ని, మ‌న లైఫ్ లోకి ఎంతమంది వ‌చ్చి వెళ్లిపోయినా మ‌న క్యారెక్ట‌ర్ ను మ‌నం మార్చుకోకూడ‌ద‌నే రూల్‌కు సిద్ధూ పాత్ర క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని చెప్పిన కిరణ్, ఈ సినిమా చూశాక మ‌న లైఫ్ లోకి మ‌ళ్లీ మాజీ ల‌వ‌ర్ వ‌స్తే బావుంటుంద‌నే ఫీలింగ్ క‌లుగుతుంద‌న్నారు.

చాలా మంది దిల్ రూబా క‌రెక్ట్ టైమ్ లో రిలీజ్ అవ‌డం లేద‌ని, ఎగ్జామ్స్, ఐపీఎల్ మొద‌ల‌య్యే ముందు సినిమాను రిలీజ్ చేస్తున్నామంటున్నారని.. త‌మ సినిమాకీ, ఐపీఎల్ కు వారం గ్యాప్ ఉంద‌ని, ఆ టైమ్ చాల‌నుకున్నామ‌ని, టీమ్ అంతా డిస్క‌స్ చేసుకుని, సినిమాను ఇంకా పోస్ట్‌పోన్ చేయ‌డం ఇష్టం లేకే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామ‌ని చెప్పారు.

క మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ సినిమాలో అవ‌స‌ర‌మైన మేర‌కు ఓ 10% రీషూట్ చేశామ‌ని చెప్పిన కిర‌ణ్, దిల్ రూబాకు క మూవీ స‌క్సెస్ ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే విష‌యాన్ని అస‌లు ఆలోచించ‌లేద‌ని తెలిపారు. ఫ్యూచ‌ర్ లో రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తాన‌ని, ఆ సినిమా కోసం పంచె క‌డ‌తాన‌ని చెప్తున్న కిర‌ణ్ ప్ర‌స్తుతం దానికి సంబంధించిన స్టోరీ డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని, ఆ పాత్ర ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

Tags:    

Similar News