కిరణ్ అబ్బవరం.. సిక్స్ ప్యాక్, లిప్ లాక్ హంగామా!
ఇటీవల ‘క’ సినిమాతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు, అదే జోష్‌తో ‘K-రాంప్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మరోసారి బిగ్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.;
మొదట మధ్యతరగతి యువతకు రీచ్ అయ్యే కథలతో కిరణ్ అబ్బవరం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రాజా వరు రాణి గారు’తో ఆకట్టుకున్న అతడు, ‘ఎస్.ఆర్. కల్యాణమండపం’తో మాస్ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. అయితే, ఆ తరువాత వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, ఇటీవల ‘క’ సినిమాతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు, అదే జోష్‌తో ‘K-రాంప్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మరోసారి బిగ్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాను నాని అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. క్రైమ్, యాక్షన్, ఎమోషన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే స్టైల్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే హింట్ ఇచ్చింది. మాస్ అండ్ యూత్‌ను ఆకట్టుకునేలా కథను డిజైన్ చేసినట్లు టాక్. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు అనుబంధ బ్యానరైన హాస్య మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. తొలిసారి తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ఫోకస్ పెట్టి, స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిక్స్ ప్యాక్ లుక్ కోసం కిరణ్ ప్రత్యేకంగా కష్టపడుతున్నాడట. గత సినిమాల్లో కాస్త స్లిమ్ గా కనిపించినా, ఈసారి పూర్తిగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం మేకోవర్ అవుతున్నాడని టాక్.
ఇదిలా ఉంటే, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో దాదాపు 20 లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని టాక్. కథ డిమాండ్ మేరకు వీటిని డిజైన్ చేసినట్లు సమాచారం. కిరణ్ ఇప్పటి వరకు ఫ్యామిలీ అండ్ క్లాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ వచ్చినా, ఈసారి ట్రెండీ కంటెంట్‌తో యూత్‌ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా స్క్రీన్‌ప్లే, కథనం పూర్తిగా కొత్తగా ఉండబోతోందని చిత్రయూనిట్ చెబుతోంది.
ఇప్పటికే మేకర్స్ నుండి వచ్చిన లుక్స్, అప్డేట్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ‘కె-రాంప్’ ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. సిక్స్ ప్యాక్‌తో మరింత మాస్ లుక్‌లోకి మారిన కిరణ్ అబ్బవరం, ఈ సినిమాతో తన కెరీర్‌లో మరో మెచ్చుకునే స్థాయికి వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ మూవీతో కిరణ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.