అబ్బవరం చెంతకు చేరిన ఆనంద్ కథ..?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బేబీ'.

Update: 2025-01-04 03:47 GMT

ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బేబీ'. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని SKN నిర్మించారు. 2023లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. అయితే ఈ మూవీ వచ్చిన మూడు నెలలకు ఇదే కాంబినేషన్ లో మరో ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఏడాదిన్నర దాటిపోయినా దీని గురించి మరో అప్డేట్ బయటకు రాలేదు.

కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా ఓ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. సాయి రాజేశ్‌ ఈ సినిమాకి కథ అందిస్తారని.. ‘3 రోజెస్‌’ వెబ్‌ సిరీస్‌ ఫేమ్ రవి నంబూరి దర్శకత్వం వహిస్తారని తెలిపారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్స్ లో ఎస్‌కేఎన్‌, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తారని చెప్పారు. ఏడుస్తూ కూర్చున్న వైష్ణవిని ఆనంద్‌ ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ పోస్టర్ కూడా వదిలారు. షూటింగ్ స్టార్ట్ అయిందని, 2024 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.

సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో అనౌన్స్ మెంట్ తోనే ఆడియన్స్ లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఏమైందో ఏమో కానీ, ‘బేబీ’ కాంబోలో పట్టాలెక్కించిన సినిమా గురించి ఆ తర్వాత ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. మేకర్స్ సైడ్ నుంచి షూటింగ్ అప్డేట్స్ ఏమీ లేవు. 2024 సమ్మర్ పోయింది.. 2025 సంవత్సరం కూడా వచ్చేసింది. ఈ గ్యాప్ లో ఆనంద్, వైష్ణవి ఇద్దరూ చెరొక సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకున్నారు. కానీ వీరిద్దరి కలయికలో అప్పట్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ సంగతి మాత్రం ఎవరికీ తెలియలేదు.

తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ‘బేబీ’ కాంబోలో తలపెట్టిన సినిమా ఆగిపోయింది. కారణాలు తెలియదు కానీ, అదే కథ ఆనంద్ దేవరకొండ దగ్గర నుండి ఇప్పుడు యువ హీరో కిరణ్ అబ్బవరం దగ్గరకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సాయి రాజేష్ స్టోరీ కిరణ్ కు నచ్చిందని, త్వరలోనే ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇకపోతే 'క' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ అబ్బవరం.. 'దిల్ రూబా' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇది ఫిబ్రవరిలో ధియేటర్లలోకి రానుంది. దీని తర్వాత 'కె ర్యాంప్' అనే సినిమా చేయనున్నారు. మరోవైపు సాయి రాజేష్ & SKN కలిసి 'బేబీ' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ అయింది. నటీనటుల ఎంపిక కూడా జరిగినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక సితార బ్యానర్ లో ఆనంద్, వైష్ణవి జంటగా ఓ సినిమా తెరకెక్కనుంది.

Tags:    

Similar News