కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్.. కనిపెడితే క్రేజీ బైక్ గిఫ్ట్..

తన అప్ కమింగ్ మూవీ దిల్ రూబా మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏకంగా బైక్ ను గిఫ్ట్ గా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.;

Update: 2025-03-02 08:32 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన అప్ కమింగ్ మూవీ దిల్ రూబా మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏకంగా బైక్ ను గిఫ్ట్ గా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. సినిమాలో ఉపయోగించిన బైక్ ను ఇవ్వనున్నట్లు తెలిపారు. అందుకు గాను దిల్ రూబా మూవీ స్టోరీ కనిపెడితే చాలని అన్నారు.

ఇప్పటివరకు ప్రమోషన్లలో తాము పలు హింట్స్ ఇచ్చామని పేర్కొన్నారు. కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు బైక్ గిఫ్ట్ ఇస్తానని తెలిపారు. తాజాగా ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.

"దిల్ రూబా నా ప్రేమ, కోపం కలయికే. ఇదే నా లవ్ (బైక్). నా ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడి డిజైన్ చేశారు. ఈ బైక్ బయట మార్కెట్ లో దొరకదు. అందుకే మీకు ఇచ్చేదామనుకుంటున్నా. అది కావాలంటే మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇప్పటి వరకు దిల్ రూబా నుంచి వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ బట్టి మూవీ ప్లాట్ గెస్ చేయండి" అని చెప్పారు.

"మోస్ట్ క్రియేటివ్ గా ఎవరు మూవీ కథ గెస్ చేస్తారో.. వాళ్లకు బైక్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చేస్తాను.. ఈ బైక్ ను ఎవరు గెలుచుకుంటారో వాళ్లతో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకు వెళ్దాను. వెళ్లి ఎంజాయ్ చేద్దాం. నాకు బాగా నచ్చిన బైక్ ను గిఫ్ట్ గా ఇస్తా. అమ్మాయిలైనా గెలిచి అబ్బాయిలకు ఇవ్వొచ్చు" అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు కిరణ్ అబ్బవరం వినూత్నంగా ఆలోచించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సూపర్ ఆఫర్ అని చెబుతున్నారు. కచ్చితంగా కథ కనిపెట్టి.. గిఫ్ట్ పట్టేస్తామని అంటున్నారు. ఇప్పటికే కొందరు ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎవరు సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరం.

ఇక సినిమా విషయానికొస్తే.. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తన్న సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హోలీ కానుకగా మార్చి 14వ తేదీన సినిమా రిలీజ్ కానుంది. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News