బిగ్ బాస్ 8 : ఆ కంటెస్టెంట్ కు బాగానే గిట్టుబాటు అయ్యిందా..?

ఐతే సీత తెర మీద ఇమేజ్ కు ఆమె బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన దానికి చూస్తే అసలు సీత ఎలా ఉంటుందో ఆడియన్స్ కు క్లారిటీ వచ్చింది.

Update: 2024-10-15 16:30 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఆరో వారం ఎలిమినేట్ అయ్యింది కిరాక్ సీత. సెవెన్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ తో బోల్డ్ ఇమేజ్ సంపాదించిన ఆమె చిన్నగా సినిమాల్లో ఛాన్సులు అందుకుంది. ముఖ్యంగా బేబీ సినిమాలో హీరోయిన్ ని మిస్ గైడ్ చేసే పాత్రలో సీత అదరగొట్టేసింది. ఆ సినిమా తర్వాత ఆమె మీద ఆఫ్ స్క్రీన్ సోషల్ మీడియా ట్రోల్స్ కూడా జరిగాయి. ఐతే సీత తెర మీద ఇమేజ్ కు ఆమె బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన దానికి చూస్తే అసలు సీత ఎలా ఉంటుందో ఆడియన్స్ కు క్లారిటీ వచ్చింది.

ఆమెకు తెలిసిన విషయాల్లో గట్టిగా మాట్లాడే సీత అందరితో మంచిగా ఉంటూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఐతే గత రెండు వారాలుగా సీత కొద్దిగా డల్ అవ్వడం వల్లే ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. సీత కన్నా హౌస్ లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తులు ఉన్నా కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉండటం వల్ల ఆమె బయటకు రావాల్సి వచ్చింది.

ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో సీత ఆరు వారాలు ఉంది. మరి ఈ 6 వారాలకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతన్నది తెలుసుకోవాలని ఆడియన్స్ కు క్యూరియాసిటీ ఉంటుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సీతకు వారానికి 2 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అందించేలా డీల్ సెట్ చేసుకున్నారట. సీత తన ఆటతో ఆరు వారాల పాటు హౌస్ లో ఉంది. సో ఆరు వారాలకు గాను మొత్తం 12 లక్షలు ఆమె రెమ్యునరేషన్ గా అందుకుందని తెలుస్తుంది.

ప్రతి వారం ఎవరు హౌస్ నుంచి వెళ్తున్నా కూడా సీత ఏడుస్తూ వారి మీద ప్రేమను చూపించేది ఐతే సీత మాత్రం తను వెళ్తూ తనేదో ముందే గెస్ చేసినట్టుగా అనిపించింది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన మొదటి వారమే సీత ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. సీత కొద్దిగా ఆటలో మార్పు ఇంకా మొదటి రెండు వారాల్లో ఆమె వాయిస్ రేజ్ చేసినట్టుగా ఉంటే మాత్రం తప్పకుండా సీత ఇంకొన్నాళ్లు హౌస్ లో ఉండేది. ఏది ఏమైనా ఆరు వారాల సీత బిగ్ బాస్ జర్నీ ఆమె ఫ్యాన్స్ కు సంతృప్తిని ఇచ్చిందనే చెప్పొచ్చు.

Tags:    

Similar News