పింక్ ట్రైలర్ చూశాక ఎంతో బాధపడ్డా: కీర్తి కుల్హారి
పింక్ సినిమాలో తాప్సీ తో కీర్తి కుల్హారి పాత్రకు కూడా సమాన ప్రాధాన్యతే ఉంటుంది. అయితే ఆ సినిమా టైమ్ లో తానెన్నో ఇబ్బందులు పడినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి వెల్లడించింది.
అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో తాప్సీ పన్ను, కీర్తి కుల్హారి ప్రధాన పాత్రల్లో నటించిన పింక్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకు జరిగిన దారుణానికి న్యాయం కోసం పోరాడే ముగ్గురు అమ్మాయిల కథతో ఈ సినిమా రూపొందింది. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో లాయర్ గా కనిపించాడు.
పింక్ సినిమాలో తాప్సీ తో కీర్తి కుల్హారి పాత్రకు కూడా సమాన ప్రాధాన్యతే ఉంటుంది. అయితే ఆ సినిమా టైమ్ లో తానెన్నో ఇబ్బందులు పడినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి వెల్లడించింది. సినిమా షూటింగ్, ప్రమోషన్స్ టైమ్ లో తనకు సరైన గుర్తింపు దక్కలేదని, అమితాబ్ తర్వాత పింక్ సినిమాలో మంచి ఆదరణ అందుకుంది తాప్సీ మాత్రమేనని కీర్తి చెప్పుకొచ్చింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్నా, పెద్దా తేడాల్లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారనుకున్నానని, తాను గతంలో పని చేసిన ఏ సినిమాకూ ఇలాంటి బేధాభిప్రాయాలు చూడలేదని కానీ పింక్ సినిమా షూటింగ్ లో ఇండస్ట్రీలో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడంతో పాటూ, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కీర్తి తెలిపింది.
ట్రైలర్ రిలీజయ్యాక అందులో మొత్తం కేవలం అమితాబ్, తాప్సీకు సంబంధించిన సన్నివేశాలే ఉండటం చూసి ఎంతో బాధపడ్డానని, ఆ టైమ్ లో తన బాధను అర్థం చేసుకున్న పింక్ రైటర్ సుజిత్ బాధపడకు, సినిమా అయిపోయాక నీకు రావాల్సిన గుర్తింపు నీకొస్తుందని సర్దిచెప్పారని తెలిపింది. కానీ సినిమా పూర్తయ్యాక ప్రమోషన్స్ విషయంలో కూడా మళ్లీ అదే సమస్యను ఎదుర్కొన్నట్టు కీర్తి చెప్పింది.
పింక్ ప్రమోషన్స్ టైమ్ లో అందరూ తాప్సీ నే ఫోకస్ చేసేవాళ్లని, అదంతా పీఆర్ స్ట్రాటజీ అని అర్థం చేసుకోవడానికే తనకు చాలా టైమ్ పట్టిందని చెప్పిన కీర్తి, ఆ సినిమా తర్వాత నుంచి తాను కూడా పీఆర్ గేమ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలిపింది. అయితే ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఎక్కువ స్టార్ డమ్ ఉన్నవారినే అందరూ గుర్తించడం అనేది కామన్. పింక్ సినిమాకు ముందు తాప్సీ కంటే కీర్తికి ఫేమ్ తక్కువ కాబట్టి అక్కడ తాప్సీ వైపు మీడియా ఫోకస్ మళ్లించింది అంతే. అనిరుద్ధారాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన పింక్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ వకీల్‌సాబ్ పేరుతో రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.