మాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్.. మరో 'దృశ్యం' కానుందా?
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కంటెంట్ తో మ్యాజిక్ చేస్తూ.. మంచి హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది.
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కంటెంట్ తో మ్యాజిక్ చేస్తూ.. మంచి హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది. ఏడాది పొడవునా సక్సెస్ లు అందుకుంటూ అదరగొడుతోంది. హైయెస్ట్ సక్సెస్ రేట్ ను సొంతం చేసుకుని సత్తా చాటుతోంది. మలయాళం మూవీ అంటే చాలు.. మినిమమ్ హిట్ అనేలా ముద్ర వేసుకుంది. ఇప్పటికే ఎన్నో మాలీవుడ్ సినిమాలు మిగతా భాషల్లోకి డబ్, రీమేక్ అయ్యి విజయాలు సాధించాయి.
ఇప్పుడు అదే కోవలోకి మరో మూవీ వెళ్లేలా కనిపిస్తోంది. అదే కిష్కింధ కాండం. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయ్ రాఘవన్ కీలక పాత్రల్లో నటించిన ఆ సినిమాకు దింజిత్ అయ్యథాన్ దర్శకత్వం వహించారు. ఓనం ఫెస్టివల్ స్పెషల్ గా సెప్టెంబర్ 12వ విడుదలైన ఆ మూవీ.. ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గుడ్ విల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జాబి జార్జి నిర్మించిన ఆ సినిమా.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
సినీ ప్రియులతోపాటు విమర్శకుల నుంచి కిష్కింధ కాండం ప్రశంసలు అందుకుంటోంది. కాన్సెప్ట్ అండ్ టేకింగ్ అదిరిపోయిందని కొనియాడుతున్నారు. బెస్ట్ మాలీవుడ్ మూవీస్ లో ఇదొకటిగా వర్ణిస్తున్నారు. లీడ్ రోల్స్ పోషించిన ఆసిఫ్, అపర్ణ, విజయ్ యాక్టింగ్ బాగుందని చెబుతున్నారు. ఇంటెలిజెంట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అని అంటున్నారు. 2024లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ సినిమా అని.. తండ్రి కొడుకుల డ్రామా సూపర్ అని చెబుతున్నారు.
కల్లెపతి రిజర్వ్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సినిమాలో అల్జైమర్స్ తో బాధపడే ఓ తండ్రికి ట్రీట్మెంట్ చేయడానికి కొడుకు ప్రయత్నిస్తుంటాడు. వారి జీవితాల్లో ఇంటి కోడలుగా అపర్ణ ఎంట్రీ ఇస్తుంది. స్టార్టింగ్ లో నార్మల్ ఫ్యామిలీ మూవీగా అనిపించే సినిమా.. ఇంటర్వెల్ తో మలుపు తిరుగుతుంది. క్లైమాక్స్ లో పెద్ద షాక్ ఇచ్చి ఓ ప్రశ్నకు సమధానం ఇవ్వకుండా ముగించారు డైరెక్టర్. అలా మిస్టరీ థ్రిల్లర్ గా గ్రిప్పింగ్ స్టోరీతో సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది.
అయితే కిష్కింధ కాండం మూవీలో కథతోపాటు బహుల్ రమేష్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది. ముజీబ్ మజీద్ మ్యూజిక్ కూడా బాగుంది. మంచి థ్రిల్లర్ గా అలరిస్తున్న కిష్కింధ కాండం.. బ్లాక్ బస్టర్ హిట్ దృశ్యం సినిమా రేంజ్ అందుకుంటుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఆ మూవీ లాగే అన్ని ఇండియన్ లాంగ్వేజ్ లో రీమేక్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?