KL రాహుల్ - ఆతియా డ‌బుల్ ధ‌మాకా శుభ‌వార్త‌

''మా అందమైన బ్లెస్సింగ్ త్వరలో వచ్చేస్తుంది... 2025!'' అని వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌న‌ స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆనందం నింపింది.

Update: 2024-11-08 13:54 GMT
KL రాహుల్ - ఆతియా డ‌బుల్ ధ‌మాకా శుభ‌వార్త‌
  • whatsapp icon

టీమిండియా యువ‌ క్రికెటర్ KL రాహుల్ - బాలీవుడ్ నటి అతియా శెట్టి 2025లో తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 2023లో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్న ఈ జంట సోషల్ మీడియాలో ఈ శుభ‌వార్త‌ను వెల్ల‌డించారు. అభిమానులు, సహచరుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

''మా అందమైన బ్లెస్సింగ్ త్వరలో వచ్చేస్తుంది... 2025!'' అని వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌న‌ స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆనందం నింపింది. వారంతా అందమైన అభినందన సందేశాలను పంపారు. కాబోయే తల్లిదండ్రులకు ఆశీర్వాదాలు వెల్లువెత్తుతున్నారు.

ఈ పోస్ట్‌పై స్పందించిన తొలి బాలీవుడ్ తారల్లో ఇటీవ‌లే పెళ్ల‌యిన‌ సోనాక్షి సిన్హా కూడా ఉన్నారు. ఓమ్‌ ఓమ్‌ ఓమ్‌గ్‌ చాలా సంతోషం అని సోనాక్షి వ్యాఖ్యానించింది. క‌పూర్ బోయ్ అర్జున్ కపూర్ శుభాకాంక్ష‌లు తెలిపాడు. గ్లామ్ ప్రపంచంలోని మరొక పాపుల‌ర్ వ్య‌క్తి షిబానీ అక్తర్ విష్ చేస్తూ.. అభినందనలు నా డార్లింగ్ మీ ఇద్దరికీ హ్యాపీ .. అని రాసారు. ఆథియా సోద‌రుడు అహ‌న్ , కృష్ణా ష్రాఫ్ త‌దిత‌రులు ఈమోజీల‌తో ఆనందం వ్య‌క్తం చేసారు.

KL రాహుల్- అతియా శెట్టి జనవరి 2023లో పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకథ ఒక సినిమా క‌థ‌ను త‌ల‌పిస్తుంది. కెఎల్ కెరీర్ ఎదిగే క్ర‌మంలో స్టార్ హీరో కుమార్తెను ప్రేమించి పెళ్లాడ‌టం యువ‌త‌రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారి రెండవ వివాహ వార్షికోత్సవానికి స‌మీపంలో ఉండ‌గా ఇప్పుడు KL రాహుల్ - అతియా డ‌బుల్ ధ‌మాకా శుభ‌వార్త ను చెప్పారన్న‌మాట‌.

Tags:    

Similar News