వీడియో : ఫస్ట్‌టైం టీవీలో చరణ్‌ని చూసి క్లింకార రియాక్షన్‌

ఈ సమయంలో సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్ కూతురు క్లింకార వీడియో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Update: 2025-01-04 09:24 GMT

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. నిన్న ముంబై వెళ్లిన రామ్‌ చరణ్‌ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. నేడు ఉదయం ముంబైలో మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. గేమ్‌ ఛేంజర్‌ ప్రెస్‌మీట్‌లో పెద్ద ఎత్తున జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్‌ అవుతున్న ఈ సమయంలో సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్ కూతురు క్లింకార వీడియో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉపాసన కొణిదెల షేర్‌ చేసిన ఈ క్యూట్‌ వీడియో మెగా ఫ్యాన్స్‌ని మాత్రమే కాకుండా అందరినీ అలరిస్తూ ఆకట్టుకుంటూ ఉంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ డాక్యుమెంటరీలో రామ్‌ చరణ్‌ ను చూసిన క్లీంకార నాన్న అంటూ సంబరపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మొదటి సారి తన నాన్నను క్లింకార టీవీలో చూసి చాలా సంతోషించింది అంటూ ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్‌ చేశారు. క్లింకార మెగా ఫ్యామిలీలో యువ రాణి మాదిరిగా పెరుగుతుంది. మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపింది అంటూ మెగాస్టార్‌ చిరంజీవితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా చెప్పుకొచ్చారు. ఉపాసన రెగ్యులర్‌గా క్లింకార ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటారు.

ఇక రామ్ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌తో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మరో అయిదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నేడు రాజమండ్రిలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు ఇప్పటికే జరిగాయి. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌ తో పాటు పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనబోతున్నారు. ముఖ్య అతిథిగా పవన్‌ రాబోతున్నారు అంటూ రెండు రోజుల క్రితమే కన్ఫర్మ్‌ కావడంతో అభిమానుల హడావిడి మామూలుగా లేదు.

కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో తమిళ్‌ స్టార్‌ డైరెక్ట్‌ ఎస్ జే సూర్య విలన్‌ పాత్రలో నటించాడు. శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్‌కి వచ్చిన స్పందనతో సినిమా స్థాయి అమాంతం పెరిగిందని యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని ముఖ్య సన్నివేశాల్లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో తమన్‌ సర్‌ప్రైజ్ చేస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ట్రైలర్ లాంచ్‌ సమయంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమాతో వింటేజ్ శంకర్‌ను చూస్తారని అంటున్నారు. కనుక ఈ సినిమా కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News