వారిద్దరి మాటలతో హర్ట్ అయిన హీరో
ముఖ్యంగా కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ టాక్ షో అయితే ఎక్కువగా సెలబ్రిటీల సీక్రెట్ ఎఫైర్స్ చుట్టూనే తిరుగుతుందనే ప్రచారం భాగా ఉంది
బాలీవుడ్ కొందరు స్టార్స్ రిలేషన్ షిప్ ని చాలా లైట్ గా తీసుకుంటారు. ఒక వ్యక్తితో ప్రేమ పేరుతో రిలేషన్ షిప్ లోకి వెళ్ళడం తర్వాత సెట్ కాలేదని బ్రేక్ అప్ చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది. ఒకప్పటి స్టార్స్ నుంచి ప్రస్తుతం ఉన్న మరికొందరు సెలబ్రిటీల వరకు అందరిది కూడా ఇదే ఇదే దారి. మళ్ళీ తమ రిలేషన్స్ గురించి పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ లో కూడా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడేస్తారు. కొందరు హీరోయిన్స్ అయితే మాజీ బాయ్ ఫ్రెండ్స్ గురించి రివీల్ చేసేస్తారు.
ముఖ్యంగా కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ టాక్ షో అయితే ఎక్కువగా సెలబ్రిటీల సీక్రెట్ ఎఫైర్స్ చుట్టూనే తిరుగుతుందనే ప్రచారం భాగా ఉంది. దానికి తగ్గట్లుగానే అతను ప్రశ్నలు కూడా ఉంటాయి. ప్రజలు సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ చూడటానికి ఇష్టపడతారని కరణ్ జోహార్ దానినే టాపిక్ గా ఎంచుకొని టాక్ షో చేస్తున్నారు. అది పెద్ద సక్సెస్ అయ్యింది. చాలా మంది సెలబ్రిటీలకి ఈ టాక్ షో నచ్చదు. డైరెక్ట్ గానే విమర్శలు చేశారు.
తాజాగా ఈ షోకి సారా ఆలీఖాన్, అనన్యా పాండే వచ్చారు. తామిద్దరికి ఒకే వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నామని ఓపెన్ అప్ అయిపోయారు. అయితే వేర్వేరు సమయాలలో సదరు వ్యక్తితో మేము రిలేషన్ షిప్ కొనసాగించామని తెలిపారు. రిలేషన్ షిప్ అనేది ఒక నమ్మకంతో నడుస్తుంది. అలాంటిది బ్రేక్ అప్ అయ్యాక మళ్ళీ కలిసి ఫ్రెండ్ లా జర్నీ చేయడం కష్టం అంటూ సారా ఆలీఖాన్ చెప్పింది.
సారా, అనన్యా ఇద్దరు కూడా గతంలో హీరో కార్తిక్ ఆర్యన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇద్దరితో తరువాత బ్రేక్ అప్ అయ్యింది. అతని గురించే హీరోయిన్స్ ఇద్దరూ కాఫీ విత్ కరణ్ షోలో మాట్లాడారని బాలీవుడ్ లో వినిపిస్తోన్న టాక్. దీనిపై హీరో కార్తిక్ ఆర్యన్ కూడా ఓపెన్ అప్ అయిపోయారు. తాను ముగిసిన రిలేషన్స్ షిప్స్ గురించి ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదని, పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ లో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం అస్సలు నచ్చలేదని పేర్కొన్నాడు.
రీసెంట్ గా దీపికా పదుకునే కూడా తన భర్త రణవీర్ సింగ్ పక్కన ఉండగానే తాను ఎంత మందితో రిలేషన్ షిప్ లో ఉన్నది చెప్పుకొచ్చింది. అయితే దీనిపై రణవీర్ కి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయిన చాలా మంది దీపికా పదుకునే అలా చెప్పడాన్ని తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.