Begin typing your search above and press return to search.

అమ్మవారి ముందు అలాంటి దుస్తులతో మోడల్స్... భక్తులు నిప్పులు!

అవును... కోల్ కతాకు చెందిన మోడల్, మాజీ మిస్ కోల్ కతా హేమో శ్రీ భద్ర, మరో ఇద్దరు మోడల్స్ కం ఫ్రెండ్స్ తో కలిసి దుర్గామాత దర్శనానికి వెళ్లారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 5:53 AM GMT
అమ్మవారి ముందు అలాంటి దుస్తులతో మోడల్స్... భక్తులు నిప్పులు!
X

గుడికి వెళ్లేప్పుడు ఎలా వెళ్లాలి.. బడికి వెళ్లేటప్పుడు ఎలా ఉండాలి.. పెళ్లికి ఎలాంటి దుస్తులు వేసుకెళ్లాలి.. చావు ఇంటికి ఏ విధంగా వెళ్లాలి వంటి విషయాల్లో చాలా మందికి బేసిక్ సెన్స్ ఉండదని చెబుతుంటారు! ఈ క్రమంలో తాజాగా ఓ మోడల్, తన ఫ్రెండ్స్ తో కలిసి రివీలింగ్ దుస్తులు ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. మండపం వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో.. భక్తులు ఫైరవుతున్నారు.


అవును... కోల్ కతాకు చెందిన మోడల్, మాజీ మిస్ కోల్ కతా హేమో శ్రీ భద్ర, మరో ఇద్దరు మోడల్స్ కం ఫ్రెండ్స్ తో కలిసి దుర్గామాత దర్శనానికి వెళ్లారు. వెళ్లేది అమ్మవారి మండపానికి అని మరిచారో.. లేక, మరోలా ఆలోచించారో తెలియదు కానీ.. అభ్యంతరకర దుస్తుల్లో దుర్గామాతను దర్శించుకున్నారు. అక్కడే ఫోటోలకు ఫోజులిచ్చారు!!

వివరాళ్లోకి వెళ్తే... కోల్ కతాలో దుర్గా పూజ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగాయనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ మోడల్, మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి సగం సగం దుస్తులు ధరించి మండపం వద్దకు వెళ్లారు. వీరికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో... సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది.

ఇందులో భాగంగా... అమ్మవారి మండపం వద్ద ఈ ముగ్గురూ అనుచితంగా దుస్తులు ధరించారంటూ నేటిజన్లు ఫైరవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు చేసిన కామెంట్లు ఆసక్తిగా ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురు మహిళలపైనా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

ఈ క్రమంలో... "ప్రతీ ఒక్కరికీ వారికి నచ్చినట్లు దుస్తులు ధరించే హక్కు ఉంటుంది. కానీ... ఆలయానికి వెళ్లేటప్పుడు దానికి అనుగుణంగా దుస్తులు ధరించడం బేసిక్ కామన్ సెన్స్" అని ఒకరు స్పందించగా... "ఎవరు ఏమనుకున్నా.. ఇలాంటి దుస్తులను దేవాలయాలు వంటి పవిత్ర ప్రదేశల్లో ఆమోదించను" అని మరొకరు కామెంట్ చేశారు.

ఇదే సమయంలొ... బట్టలు అసభ్యంగా ఉన్నాయని రచ్చ చేసేవారు.. శాస్త్రాల ప్రకారం దేవుడు అన్ని చోట్లా ఉన్నాడని గుర్తించుకోవాలి.. మండపంలో ఫలానా దుస్తులు ధరించకూడదు అనే మాటల్లో అర్ధమే లేదు.. ఎక్కడ ఏ దుస్తులు ధరించినా ప్రతీదీ భగవంతుడు చూడగలడు అంటూ ఇంకొకరు కౌంటర్ గా స్పందించారు!