1000 కోట్లు ఈసారి కొట్టేస్తారా?
అటుపై మే 1న సూర్య హీరోగా నటించిన ` రెట్రో` రిలీజ్ అవుతుంది. సూర్య గత చిత్రం `కంగువ` పరాజయం చేందిన సంగతి తెలిసిందే.;

కోలీవుడ్ లో భారీ రిలీజ్ లకు సన్నాహాలు జరుగుతున్నాయా? ఈసారి బాక్సాఫీస్ వద్ద కోలీవుడ్ 1000 కోట్ల డ్రీమ్ పుల్ ఫిల్ అయ్యే అవకాశం ఉందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే తల అజిత్ కథానాయకుడిగా నటించిన `గుడ్ బ్యాడ అగ్లీ` భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది. అజిత్ గత సినిమా `విదాముయార్చీ` ఆశించిన ఫలితం సాధించిన నేపథ్యంలో `గుడ్ బ్యాడ్ అగ్లీ`తో మోత మోగించడం ఖాయమంటూ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
అటుపై మే 1న సూర్య హీరోగా నటించిన ` రెట్రో` రిలీజ్ అవుతుంది. సూర్య గత చిత్రం `కంగువ` పరాజయం చేందిన సంగతి తెలిసిందే. దీంతో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెట్రోతో సూర్య బౌన్స్ బ్యాక్ అవుతాడని అంచనాలు భారీగా ఉన్నాయి. అటుపై విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `థగ్ లైప్` రిలీజ్ కు ఉంది. జూన్ 5న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది.
ఇద్దరు చాలా కాలం తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే? వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటుపై జూన్ 20 ధనుష్ , నాగార్జున నటిస్తోన్న `కుభేర` రిలీజ్ అవుతుంది. శేఖర్ కమ్ములా తొలిసారి ముంబై మాఫియాని టచ్ చేసి చేస్తోన్న చిత్రమిది. శేఖర్ మార్క్ యాక్షన్ ఎలా ఉంటుంది? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా కూడా హిట్ అయిందంటే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. అటుపై సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న `కూలీ` ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా హిట్ అయిందేంటే 1000 కోట్లు పక్కా అనే టాక్ బలంగా ఉంది. లోకేష్ కనగరాజ్- రజనీకాంత్ గత చిత్రాలు ఇప్పటికే 500 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ద్వయం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.