కంగువా.. బాగానే లేపుతున్నారు కానీ..

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు.

Update: 2024-10-24 09:16 GMT

'బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహా చిత్రం కంగువా.. తమిళ సినీ ఇండస్ట్రీలో మైలురాయిగా నిలుస్తుంది..' రీసెంట్ గా స్టార్ హీరో సూర్య చేసిన కామెంట్స్ ఇవి. అదే సమయంలో తమిళనాడుకు చెందిన బయర్స్, సినీ ప్రియులు కూడా కోలీవుడ్ బాహుబలిగా కంగువాను ట్రీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి స్థాయిలో కంగువా భారీ హిట్ అవుతుందని, అనేక రికార్డులు బద్దలు కొట్టి కోలీవుడ్ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతుందని ఆశలు పెట్టుకున్నారట.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. బాహుబలితో పలు చిత్రాల కంపారిజన్ ను ప్రస్తావిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ దళపతి పులి మూవీని బాహుబలి కోణంలో ఆలోచించి చేశారని అంటున్నారు. విజయ్ డ్యుయల్ రోల్ పోషించిన ఆ సినిమాను చిమ్బు దేవన్ తెరకెక్కించారు. హన్సిక, శ్రుతి హాసన్ హీరోయిన్లుగా నటించగా.. శ్రీదేవి, కిచ్చ సుదీప్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఫుల్ వీ ఎఫ్ ఎక్స్ వర్క్ తో రూపొందిన పులి మూవీ డిజాస్టర్ గా మారింది.

ఆ తర్వాత మన బాహుబలి మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మల్టీస్టారర్ మూవీ సంఘమిత్రను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. పలు కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు కంగువాను కూడా సూర్య సహా మూవీ టీమ్.. బాహుబలితో పోల్చుతుందడంతో పులి, సంఘమిత్ర ప్రాజెక్టుల విషయంలో జరిగిన దాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.

ఆ చిన్న నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని కోరుతున్నారు. కంగువా మంచి హిట్ అవ్వాలని ఆశిస్తున్నారు. అదే సమయంలో కంగువా మేకర్స్.. మూవీ కంటెంట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఫస్ట్ పార్ట్.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. కచ్చితంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. కాన్ఫిడెంట్ గా ఉండడమే కాదు.. నార్త్ టూ సౌత్ పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ఇప్పటికే సూర్య.. ప్రమోషనల్ టూర్ తో బిజీగా ఉన్నారు. నార్త్ సిటీస్ లో తెగ తిరుగుతున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఫ్యాన్స్ తో మీట్ అవుతున్నారు. దర్శకుడు శివ, హీరోయిన్ దిశా పటానీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. అటు నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. త్వరలో భారీ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు. మరి నవంబర్ 14వ తేదీన విడుదల కాబోతున్న కంగువా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News