దుబాయ్ రేస్ విజయం తర్వాత త‌ళా అజిత్ చిద్విలాసం!

కొద్దిరోజులుగా త‌ళా అజిత్ కార్ రేస్ సాహ‌సాల గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది.

Update: 2025-01-12 13:40 GMT

కొద్దిరోజులుగా త‌ళా అజిత్ కార్ రేస్ సాహ‌సాల గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. దుబాయ్ ఈవెంట్లో గెల‌వ‌డంపైనే అత‌డు దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. అజిత్ రేస‌ర్ల గ్రూప్ నాయ‌కుడు కావ‌డంతో ఈ రేస్ ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాడు. ప్రీప్రాక్టీస్ సెష‌న్స్ లో చాలా రిస్క్ చేసాడు. త‌న కార్ రేస్ ట్రాక్ లో పెను ప్ర‌మాదానికి గుర‌వ్వ‌డంతో అభిమానుల్లో ఆందోళ‌న పెరిగింది. కానీ అన్నిటినీ ఇప్పుడు త‌ళా మ‌రిపించాడు. జనవరి 12న దుబాయ్ 24H రేసింగ్ ఈవెంట్‌లో తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ అజేయంగా మూడవ స్థానంలో నిలిచాడు. ఈ విజయానికి అత‌డి అభిమానులు ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. రేస్ ముగిశాక విజ‌యం ఖ‌రార‌య్యాక‌.. పిట్ లేన్ వద్ద ఉన్న తన భార్య షాలినిని త‌ళా ముద్దు పెట్టుకుని ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించాడు త‌ళా. రేసింగ్ ఆద్యంతం షాలిని తనను ఉత్సాహపరిచింది. ఆ అరుదైన‌ క్షణానికి సంబంధించిన‌ వీడియో ఇంటర్నెట్‌లో వైర‌ల్‌గా షేర్ అవుతోంది.

అజిత్ కుమార్ ఫ్యాన్స్ క్లబ్ Xలో షేర్ చేసిన వీడియోలో అజిత్ తన భార్య షాలినిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం సెల‌బ్రేష‌న్ లో జోష్‌ని ఆవిష్క‌రించింది. చుట్టుపక్కల జనం హర్షధ్వానాలు చేస్తుండ‌గా షాలినికి అజిత్ ముద్దిచ్చాడు. ఆ తర్వాత అతడు షాలిని పక్కన నిలబడి ఉన్న తన కుమార్తె అనౌష్కకు వామ్ హ‌గ్ ఇచ్చాడు. త‌న గారాల కూతురుకు పెక్ ఇచ్చాడు. మరొక వీడియోలో త‌ళా భారతీయ జెండాను పట్టుకుని పిట్ లేన్ వ‌ద్ద‌ ఆనందంగా పరిగెత్తుతూ క‌నిపించాడు.

అతడి అద్భుతమైన ప్రదర్శన వీక్షించిన‌ ఆర్ మాధవన్, శివకార్తికేయన్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ వంటి ప్రముఖులు తమ గర్వాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అభినందనల‌తో ముంచెత్తారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని వీక్షించడానికి వేదిక వద్ద ఉన్న మాధవన్ త‌న స్నేహితుడు త‌ళా అద్భుతమైన ఘనతను సాధించడంతో తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. ఆ అరుదైన క్ష‌ణాన్ని అత‌డు కెమెరాలో క్యాప్చుర్ చేసాడు. మ్యాడీ తన కెమెరాను అజిత్ వైపు చూపిస్తూ ఉత్సాహంగా పరిగెత్తాడు. ఆ క్ష‌ణం మ్యాడీ త‌ళా అజిత్ పై అభిమానాన్ని దాచుకోలేక‌పోయాడు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు ఫోటోలు అంత‌ర్జాలాన్ని ముంచెత్తాయి.

Tags:    

Similar News